ఇరాన్ యుద్ధం.. యూఏఈ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ

Publish Date:Apr 22, 2026

Advertisement

ఇరాన్ యుద్ధం తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో  అమెరికా సైనిక స్థావరాల అవసరంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.    ఇరాన్, అమెరికా ఘర్షణ గల్ఫ్ ప్రాంతాన్ని కుదిపేసిన తర్వాత.. యూఏఈ తన భద్రత, ఆర్థిక, కరెన్సీ వ్యూహాలను పునఃపరిశీలిస్తోంది. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల నిజంగా ప్రయోజనం ఉందా? లేక ఇది దేశానికి అదనపు ప్రమాదాన్ని తెస్తుందా? అనే ప్రశ్నలు  బలంగా వినిపిస్తున్నాయి.  అదే సమయంలో, యూఏఈ చైనాతో మరింత సన్నిహిత సంబంధాలను అన్వేషిస్తూ, అమెరికా డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించే సంకేతాలు ఇస్తోంది.

అమెరికా స్థావరాలు.. వ్యూహాత్మక ఆస్తి కాదు..  భారం?

యూఏఈలోని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అబ్దుల్ ఖలేఖ్ అబ్దుల్లా అభిప్రాయం మేరకు.. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు యూఏఈ రక్షణ వ్యవస్థలోని బలాలనూ, బలహీనతలను బహిర్గతం చేశాయి. ఈ దాడుల సమయంలో యూఏఈ స్వయంగా తనను తాను రక్షించుకోగలదని నిరూపించుకుంది. అందువల్ల అల్ ధఫ్రా ఎయిర్ బేస్  సహా అమెరికా సైనిక స్థావరాలు ఇప్పుడు ఆస్తిగా కాకుండా భారంగా కనిపిస్తున్నాయని ఆయన అంటున్నారు. యూఏఈలో సుమారు 3,500 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇప్పుడు అబుదాబిలో జరుగుతున్న చర్చల్లో ప్రధాన ప్రశ్న ఏమిటంటే..  అమెరికా దళాలు నిజంగా మన భద్రతను పెంచుతున్నాయా? లేక మనపై దాడులు జరిగే అవకాశాన్ని పెంచుతున్నాయా? అన్నదే. 

ఇరాన్ దాడులు.. ఆర్థిక ప్రభావం: బిలియన్ల నష్టం

ఇరాన్ యూఏఈపై ప్రయోగించిన వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపాయి. దుబాయ్, అబుదాబి మార్కెట్ క్యాపిటలైజేషన్లో 120 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టం వాటిల్లింది.  18 వేలకు పైగా విమానాలు రద్దు. దుబాయ్ రియల్ ఎస్టేట్ సూచీల పతనం. విమానాశ్రయాలు, ఓడరేవులు, పారిశ్రామిక కేంద్రాలు, పెట్రోకెమికల్ సదుపాయాలు దెబ్బతినడం సహా      పౌరులు, సైనికులు మరణించారు. ఈ దాడులు యూఏఈ ఆర్థిక వ్యవస్థ ఎంతగా బయటి నుంచి వచ్చే ప్రమాదాలకు గురవుతుందో స్పష్టంగా చూపించాయి.

అమెరికా  ఆర్థిక మద్దతు: స్వాప్ లైన్ చర్చలు

యుద్ధం వల్ల వచ్చిన ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యూఏఈ, అమెరికాతో అత్యవసర ఆర్థిక చర్చలు జరిపింది. తీవ్రమైన మార్కెట్ ఒత్తిడి సమయంలో యూఏఈ సెంట్రల్ బ్యాంక్ కు డాలర్ల లభ్యతను హామీ చేసే కరెన్సీ స్వాప్ లైన్ కోరింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సాధారణంగా అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థలకే స్వాప్ లైన్లు ఇస్తుంది. కాబట్టి ఆ స్వాప్ లైన్ పొందే అర్హతను యూఏఈ సాధించే అవకాశాలు తక్కువ. అందుకు బదులుగా   యూఎస్ ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా మద్దతు పొందే అవకాశం ఉంది. యుద్ధం తర్వాత డాలర్ లభ్యతపై అనిశ్చితి పెరగడంతో.. యూఏఈ ప్రత్యామ్నాయ కరెన్సీలను పరిశీలిస్తోంది.

యూఏఈ అధికారులు సూచించిన మార్పులు

- చమురు మరియు ఇతర ప్రధాన లావాదేవీలలో చైనీస్ యువాన్ వినియోగం  
- ఇది ప్రపంచ చమురు వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు
- చైనా యువాన్ను అంతర్జాతీయీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఇది అనుకూలం
ఇది గల్ఫ్ ప్రాంతంలో డాలర్ రహితీకరణ  దిశగా కీలకమైన ముందడుగు  
ఇరాన్–అమెరికా ఘర్షణ ప్రభావం యూఏఈకే పరిమితం కాలేదు. ప్రాంతాల వారీగా విపరీతమైన నష్టం వాటిల్లింది.   
 - ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్ జీ కాంప్లెక్స్ మూసివేత.
- దీని పునరుద్ధరణకు 3 నుంచి 5 సంవత్సరాలు పట్టవచ్చు.
- సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, జోర్డాన్లలో మౌలిక సదుపాయాల నష్టం.
- ప్రాణనష్టం, ఇంధన సరఫరా అంతరాయం
ఐఎంఎఫ్ అంచనా ప్రకారం, ప్రతి దేశం పునరుద్ధరణ వేగం భౌగోళిక పరిస్థితులు, ఎగుమతుల పునఃప్రారంభం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. చైనా  ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటున్నది.   గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశంగా చూస్తోంది. అబుదాబి యువరాజుతో చర్చల్లో జీజిన్పింగ్  చారిత్రాత్మక మార్పులు జరుగుతున్నాయి అని వ్యాఖ్యానించారు. చైనా, అరబ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు ఇంధన, మౌలిక సదుపాయాలు, కరెన్సీ సహకారం వంటి రంగాల్లో చైనా ప్రభావం పెరుగుతోంది. 

 యూఏఈ కొత్త దిశలో ప్రయాణించడానికి ఇరాన్ అమెరికా యుద్ధం మార్గం చూపింది.  ఇరాన్ యుద్ధం యూఏఈకి ఒక కీలక పాఠం నేర్పింది. అదేమిటంటే.. భద్రత, ఆర్థిక వ్యవస్థ, కరెన్సీ ఈ మూడింటినీ వికేంద్రీకరించాలి.  అమెరికా సైనిక దళాలపై ఆధారపడటం, డాలర్ పై ఆధారపడటం.. ఇవి రెండూ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. చైనాతో పెరుగుతున్న సంబంధాలు, యువాన్ వినియోగం, ఆర్థిక భద్రతా వ్యవస్థల పునర్నిర్మాణంఇవే ఇప్పుడు  యూఏఈ భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించే కీలక అంశాలు.

-సీతారాం కంఠంనేని
 

By
en-us Political News

  
కడప నగరంలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఏపీలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఈ హత్య కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న అనంతబాబు.. తాజాగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. సాక్షులను భయపెట్టి, డబ్బు ఆశ చూపి తన వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడమే కాకుండా.. ఇప్పుడు ఆ ప్రయత్నం ఆయన బెయిల్ రద్దుకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నేపాల్ ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపు విధానంలో సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
తన రాజకీయ చతురతతో, దార్శనికతతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించిన ఒక విజనరీ లీడర్ చంద్రబాబు కథను సెల్యులాయిడ్ పై చూడటం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రగతి దీర్ఘకాలం పాటు కొనసాగించాలంటే దేశీయంగా ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన కొన్నేళ్లుగా భారత వాస్తవ జీడీపీ వృద్ధి సగటున 7.7 శాతంగా నమోదవుతోంది. ముఖ్యంగా పొరుగు దేశమైన చైనా 4.6 శాతం వృద్ధి వద్ద ఆగిపోగా, ఇతర వర్ధమాన దేశాలు 3.4 శాతానికే పరిమితమయ్యాయి.
నాదెండ్ల భాస్కరరావు ఆత్మకథ వాకింగ్ విత్ డెస్టినీ అన్న పుస్తకంలో అసలు ఏముంది?
భారత తలసరి ఆదాయం ఇప్పటికీ చైనా తలసరి ఆదాయంలో ఐదో వంతు మాత్రమే కావడంతో ఉత్పాదకత పెరుగుదలకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయ వృద్ధికి కావలసినంత స్పేస్ ఉంది. అంతే కాకుండా ఆర్థిక పురోగతి మరింత వేగం పుంజుకోవడానికి ఇండియాలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న తరుణంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చేవరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని పేర్కొన్న ట్రంప్.. నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ పౌరులకు అసౌకర్యాన్ని తగ్గించే ఉద్దేశంతో మెట్రో రైళ్ల రాకపోకలను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు.
విచారణ కమిషన్ చట్టం కింద నిర్దేశించిన సరైన ప్రక్రియను ఘోష్ కమిషన్ పాటించలేదని ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.