ఆర్టీసీ సమ్మె.. తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్

Publish Date:Apr 22, 2026

Advertisement

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యో గులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వంతో మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె ప్రారంభమైనట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి.   ప్రభుత్వ ప్రతినిధుల తో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్  జేఏసీకి చెందిన నాయకులు సచివాలయం లో నాలుగు గంటలకుపైగా చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవ డంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద సమ్మె కొనసాగుతోంది.  బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  అన్ని డిపోల ముందు  డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద సంఖ్యలో చేరి నిరసలకు దిగారు.  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్ లు, బస్ స్టేషన్లు బోసిపోయాయి. ఇక హైదరాబాద్ లో అయితే  సిటీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 ఆర్టీసీ తెలంగాణ  వ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది.  రాష్ట్రంలోని అన్ని ప్రధాన డిపోల వద్ద ఉదయం నుంచే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 32 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. డిపో గేట్ల వద్ద బైఠాయించిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.

బస్సుల నిలిపివేత ప్రభావం సామాన్య ప్రజానీకంపై తీవ్రంగా పడింది. ఉదయాన్నే విధులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు,  కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌లకు చేరుకున్న ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్ వంటి జిల్లాల్లో సమ్మె ప్రభావం  మరీ తీవ్రంగా ఉంది.  ఆదిలాబాద్ రీజియన్‌లో దాదాపు 641 బస్సులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 850 బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు.

మరోవైపు, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం,  ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాయి. కొన్ని ప్రాంతాల్లో అద్దె బస్సులను నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ప్రయాణికుల రద్దీకి అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వాహనదారులు, ఆటో డ్రైవర్లు ప్రయాణికుల నుండి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. సమ్మె కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత జటిలమయ్యే అవకాశం ఉంది.  మరో వైపు తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ   వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. 

By
en-us Political News

  
ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ పౌరులకు అసౌకర్యాన్ని తగ్గించే ఉద్దేశంతో మెట్రో రైళ్ల రాకపోకలను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు.
విచారణ కమిషన్ చట్టం కింద నిర్దేశించిన సరైన ప్రక్రియను ఘోష్ కమిషన్ పాటించలేదని ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో ఉన్న నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యం విషమించి.. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య అజెండాలో భాగంగా అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద అనేక దేశాలపై అదనపు సుంకాలను విధించారు. అయితే.. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేలాది కంపెనీలు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఫిబ్రవరిలో హైకోర్టు ఈ సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చడంతో.. సుమారు 127 బిలియన్ డాలర్ల మొత్తం రీఫండ్‌కు అర్హత పొందింది. ఈ చారిత్రాత్మక తీర్పు ట్రంప్ ఆర్థిక విధానాలకు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా కెనడా విదేశీయులకు స్వర్గధామంగా నిలిచింది. అయితే, ఇటీవల కాలంలో పెరుగుతున్న జనాభా, గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం, మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడి దృష్ట్యా కెనడా తన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేస్తోంది. తాజాగా తీసుకువచ్చిన బిల్ ప్రధానంగా కెనడా పౌరసత్వం పొందే ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు.. అనర్హులను ఏరివేసేందుకు ఉద్దేశించినదని చెబుతున్నారు.
ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల సమయంలో అమెరికా స్థావరాల కంటే యూఏఈ సొంత రక్షణ వ్యవస్థలే సమర్థవంతంగా పనిచేయడం విశేషం. దీంతో అల్ ధఫ్రా వంటి భారీ అమెరికా సైనిక స్థావరాలు దేశానికి ఆస్తిగా కాకుండా.. శత్రువుల దాడులను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్న అభిప్రాయం వ్యూహకర్తల్లో వ్యక్తమవుతోంది.
యూఏఈ తన భద్రత, ఆర్థిక, కరెన్సీ వ్యూహాలను పునఃపరిశీలిస్తోంది. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల నిజంగా ప్రయోజనం ఉందా? లేక ఇది దేశానికి అదనపు ప్రమాదాన్ని తెస్తుందా? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
అనాథల రాతను మారుస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ సంధించిన అక్షరాయుధం నెల్లూరులో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. మున్సిపల్ స్కూల్స్ భవనాలు చూసి ముగ్ధులై, భిక్షా పాత్రలను విసిరికొట్టి పుస్తకాలు పట్టిన ఆ చిన్నారుల పట్టుదల, నేడు వారిని సమాజం గర్వపడే హీరోలుగా నిలబెట్టింది.
వీరు ఒక వ్యక్తిగత కుటుంబ వివాదాన్ని ఆధారంగా చేసుకుని బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగి సి ఐ ఎస్ఐలను అదుపులోకి తీసుకున్నారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారనీ.. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తమకు డబ్బు ఆశ చూపి, ప్రాణహాని తలపెడతామని బెదిరించారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ పరుగుల వరద పారించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలింగ్ ను ఊచకోత కోశాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్37 పరుగులు, ఇషాన్ కిషన్ పాతిక పరుగులు చేశారు. చివరిలో హెన్రిచ్ క్లాసెన్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించి 13 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
కేరళలోని త్రిస్సూర్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.