Publish Date:Apr 22, 2026
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో ఉన్నప్పటికీ.. ఇండియా తిరుగులేని వృద్ధిని కనబరుస్తూ గ్లోబల్ ఎకానమీకి ఒక ప్రధాన ఇంజిన్‌లా మారుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ విశ్లేషణల ప్రకారం, భారత్ తన ఆర్థిక పటిష్టతను చాటుకుంటూ ప్రపంచ సగటు కంటే రెండింతల వేగంతో దూసుకుపోతోంది. అయితే.. ఈ గణనీయమైన ప్రగతి దీర్ఘకాలం పాటు కొనసాగించాలంటే దేశీయంగా ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన కొన్నేళ్లుగా భారత వాస్తవ జీడీపీ వృద్ధి సగటున 7.7 శాతంగా నమోదవుతోంది. ముఖ్యంగా పొరుగు దేశమైన చైనా 4.6 శాతం వృద్ధి వద్ద ఆగిపోగా, ఇతర వర్ధమాన దేశాలు 3.4 శాతానికే పరిమితమయ్యాయి. భారత్ ఈ స్థాయిలో రాణించడానికి ప్రధాన కారణం దేశీయంగా ఉన్న బలమైన డిమాండ్ అని ఐఎంఎఫ్ చెబుతోంది.
ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం.. ప్రజల వినియోగం పెరగడం, స్థిరమైన పెట్టుబడులు దేశ ఆర్థిక రథాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఇక ఇండియాకు ఉన్న మరో సానుకూల అంశం ఇక్కడి యువ జనాభా. దేశ జనాభాలో సుమారు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే కావడం వల్ల భారత్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామిక శక్తి అందుబాటులో ఉంది. పాశ్చాత్య దేశాలు, చైనా క్రమంగా వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో.. భారత యువశక్తి ఉత్పాదకతను పెంచడానికి ఒక గొప్ప అవకాశంగా మారింది. దీనికి తోడు గత దశాబ్ద కాలంలో చేపట్టిన డిజిటల్ మౌలిక వసతుల కల్పన, పన్ను సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మెరుగైన ర్యాంకింగ్ వంటివి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.
అయినప్పటికీ, దేశ ఆర్థిక పురోగతికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. జీడీపీలో తయారీ రంగం వాటా కేవలం 15 శాతం కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అదే జపాన్ 35 శాతం, చైనా 30 శాతం, తో పోలిస్తే ఇండియా ఈ విషయంలో వెనుకబడి ఉంది. కేవలం కేవలం సేవా రంగంపైనే ఆధారపడి వృద్ధిని సాధించడం దీర్ఘకాలంలో సాధ్యం కాకపోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. గత ఏడాది కాలంలో రూపాయి విలువ గణనీయంగా క్షీణించడం వల్ల చమురు, గ్యాస్, బంగారం దిగుమతుల భారం పెరుగుతోంది. భవిష్యత్తు అంచనాలను పరిశీలిస్తే.. 2026 నాటికి భారత వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా.
అదే సమయంలో చైనా వృద్ధి 4.4 శాతానికి పడిపోయే అవకాశం ఉందని అదే ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక భారాన్ని మోసే బాధ్యత భారత్‌పైనే ఉంది. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలంటే భారత్ హరిత ఇంధన రంగం వైపు వేగంగా అడుగులు వేయాలి. శిలాజ ఇంధనాల దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు, తద్వారా రూపాయి విలువను స్థిరీకరించవచ్చు. చైనాకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించాలంటే తయారీ రంగాన్ని భారీగా విస్తరించడం తప్పనిసరి. ఎగుమతులు పెరిగి, విదేశీ పెట్టుబడులు ప్రవహించినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది.
- సీతారాం కంఠంనేని
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/do-you-know-the-obstacles-to-indias-economic-growth-36-217950.html
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు.
తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది.
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.