వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిలు రద్దు?

Publish Date:Apr 22, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ హత్య కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న అనంతబాబు.. తాజాగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. సాక్షులను భయపెట్టి, డబ్బు ఆశ చూపి తన వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడమే కాకుండా.. ఇప్పుడు ఆ ప్రయత్నం ఆయన బెయిల్ రద్దుకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గతంలో తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అనంతబాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్‌పై  ఉన్నారు. అయితే ఈ నెల 24, 25 తేదీల్లో కోర్టులో నిందితులపై నేరాభియోగాల నమోదు ప్రక్రియ జరగనుంది. ఈ తరుణంలో సాక్షులు ఇచ్చే వాంగ్మూలం కేసు గమనాన్ని మార్చే అవకాశం ఉండటంతో..  వారిని ప్రలోభపెట్టేందుకు అనంతబాబు ప్రయత్నించారు. నలుగురు కీలక సాక్షులను ఒక అపార్ట్‌మెంట్‌లో బంధించి, ఒక్కొక్కరికి   లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

సాక్షులను నిర్బంధించిన అనంతబాబు, వారికి ముందస్తుగా  లక్ష నగదు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే  మరో 2 లక్షలు ఇస్తాననీ, లేకుంటే చంపేస్తానీని వారిని బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో వారు ఆ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన అనంతబాబు తన గన్‌మెన్లను, కారును అక్కడే వదిలేసి బైక్‌పై   పరారయ్యారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో సాక్షులపై ఒత్తిడి తెచ్చిన విషయం వాస్తవమని తేలింది. ఈ మేరకు అనంతబాబుతో పాటు ఆయన అనుచరుడు, వైసీపీ బీసీ సెల్ నేత మాగంటి రాంబాబుపై కొత్తగా కేసు నమోదు చేశారు. రాంబాబును ఇప్పటికే అదుపులోకి తీసుకోగా..  పరారీలో ఉన్న అనంతబాబు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలోనే సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉండటంతో, ఇప్పుడు అనంతబాబు బెయిలు రద్దు కావడం, మళ్ళీ జైలుకు వెళ్లడం ఖాయమని న్యాయ నిపుణులు అంటున్నారు. 

ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెను ఇప్పటికే సుదీర్ఘంగా విచారించిన పోలీసులు, తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు బాధితుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని, నిందితుడు సాక్షులను బెదిరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం పరారీలో ఉన్న అనంతబాబు ఎక్కడ ఉన్నారనే దానిపై పోలీసులు టెక్నికల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సాక్షుల నిర్బంధం, లంచం ఆశ చూపడం వంటి బలమైన ఆధారాలు దొరకడంతో.. ఈసారి ఆయనకు కోర్టు నుండి ఉపశమనం లభించడం కష్టమని పరిశీలకులు అంటున్నారు.   

By
en-us Political News

  
48 ఏళ్ల ఆసిఫ్ రజా వ్యాపారవేత్త ముసుగులో అమెరికాలోకి ప్రవేశించి ఈ వినాశకర మిషన్‌ను ప్రారంభించాడు.
ప్రధానంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు ఈ స్కామ్‌లో కీలక సూత్రధారిగా భావిస్తున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యుల బృందం గవర్నర్‌కు చికిత్స అందిస్తోంది. ఆయనకు ప్రాథమికంగా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.
సాధారణంగా శబరిమల ఆలయ పరిసరాలను నో ఫ్లై జోన్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఎటువంటి విమానాలు లేదా హెలికాప్టర్లు ప్రయాణించడానికి అనుమతి లేదు. అయితే, కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ ఆలయ గోపురం మరియు పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ ఎత్తులో పదేపదే చక్కర్లు కొట్టినట్లు భక్తులు, ఆలయ సిబ్బంది గుర్తించారు.
అమెరికా ప్రతినిధుల బృందంలో ట్రంప్ సన్నిహితుడు జారెడ్ కుష్నర్‌తో పాటు ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్ ఉన్నారు. వీరిద్దరూ ఇస్లామాబాద్ చేరుకుని, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ముఖాముఖి భేటీ అవుతారు. ఈ పర్యటన ద్వారా ఇరాన్‌తో ఉన్న విభేదాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ భావిస్తోంది.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించగా, మరోవైపు గుజరాత్ యువ సంచలనం సాయి సుదర్శన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో దిగ్గజాల రికార్డులను తిరగరాశాడు. అభిమానులకు కనువిందు చేసిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించారు.
సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చలు ఫలప్రదమవ్వడంతో, శనివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 47 బంతుల్లోనే 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను గుజరాత్ నుంచి లాగేసుకున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.