గోబల్ గ్రోత్ ఇంజిన్ ఇండియా కానీ..

Publish Date:Apr 22, 2026

Advertisement

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలో భారతదేశం వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా ఎదుగుతోంది. అందులో సందేహం లేదు. అయితే..  అదే సమయంలో తయారీ రంగం బలహీనత, రూపాయి విలువ పతనం వంటి సమస్యలు ఈ వేగాన్ని నిలబెట్టగలవా అన్నసందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.  భారత ఆర్థిక వృద్ధి  ప్రపంచ సగటు కంటే రెండింతలుగా ఉంది. 2022-2025 మధ్య కాలంలో భారతదేశం వాస్తవ జీడీపీ సగటున 7.7శాతం వృద్ధి నమోదు చేసింది. అదే సమయంలో చైనా 4.6శాతం, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధి 3.4శాతంగా ఉన్నాయి. ఈ గణాంకాలు చాలు.. ఇండియా గ్లోబల్ గ్రోత్ కు ప్రధాన చోదకంగా నిలబెట్టాయని చెప్పడానికి. బలమైన దేశీయ డిమాండ్, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం, వినియోగం, పెట్టుబడులలో స్థిరత్వం ఇవీ భారత్ ఆర్థిక పురోగతికి కారణాలుగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ  చెబుతోంది. 

భారత తలసరి ఆదాయం ఇప్పటికీ చైనా తలసరి ఆదాయంలో ఐదో వంతు మాత్రమే కావడంతో ఉత్పాదకత పెరుగుదలకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయ వృద్ధికి కావలసినంత స్పేస్ ఉంది.  అంతే కాకుండా ఆర్థిక పురోగతి మరింత వేగం పుంజుకోవడానికి ఇండియాలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. 

 ఇకపోతే.. యువ భారత్.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద శ్రామిక శక్తిగా చెప్పాలి. భారత జనాభాలో 65 శాతం మూడున్నర పదుల వయస్సులోపు వారే.   చైనా సహా  పాశ్చాత్య దేశాలు వృద్ధాప్య దశలోకి వెళ్తున్న నేపథ్యంలో యువశక్తి..  భారతదేశానికి  ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తోంది. అలాగే గత దశాబ్దంలో  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లలో ఇండియా  79 స్థానాలు మెరుగుదల కనబరిచింది. అదే విధంగా డిజిటల్ మౌలిక వసతులు, పన్ను సంస్కరణలు, లాజిస్టిక్స్ అభివృద్ధి కూడా పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడటానికి దోహదపడ్డాయి.    
ఐఎంఎఫ్ 2026 వృద్ధి అంచనాను 6.4% నుంచి 6.5%కి పెంచింది.  ప్రపంచ ఇంధన సంక్షోభం మధ్య కూడా భారత్ ఆర్థిక వృద్ధిలో పెరుగుదల ఉండటం విశేషం. ఎందుకంటే..   ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలలో ఇండియా ముందు వరుసలో ఉంటుంది.  ఇక చైనా వృద్ధి 2026 నాటికి 4.4%కి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. దీంతో ప్రపంచ వృద్ధి భారాన్ని భారతదేశం మోయాలన్న అంచనాలు పెరుగుతున్నాయి. 

ఇక ఇండియా వృద్ధికి అవరోధంగా నిలుస్తున్న సమస్యల విషయానికి వస్తే.. భారత్ జీడీపీలో తయారీ రంగం వాటా కేవలం 15శాతంలోపే.. అదే జపాన్ ను తీసుకుంటే ఆ దేశంలో ఇది 35శాతం, చైనాలో 30శాతం, దక్షిణ కొరియాలో పాతిక శాతంగా ఉంది. ఇక రెండోది రూపాయి విులవ పతనం. డాలర్ పరంగా చూస్తే ఇండియా 6వ స్థానానికి పడిపోయింది. చమురు, బంగారం, గ్యాస్ వంటి వాటి దిగుమతులు భారీగా పెరిగాయి.  ఈ పరిస్థితి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే ప్రమాదాన్ని ఇనుమడింప చేసింది.  వీటిని అధిగమించి భారత్ ముందుకు సాగాలంటే.. హరిత ఇంధనంపై దృష్టి సారించాలి. దీని వల్ల శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. దాంతో ఇంధన బిల్లు ఇటోమేటిగ్గా తగ్గుతుంది. అంటే రూపాయి స్థిరపడుతుంది.  ప్రపంచ ఇంధన సంక్షోభాల ప్రభావం తగ్గుతుంది  ఇందు కోసం తయారీ రంగాన్ని భారీగా విస్తరించాలి. తద్వారా ఎగుమతులు పెరుగుతాయి. విదేశీ మారక ద్రవ్య ప్రవాహం కూడా పెరుగుతుంది. అంటే రూపాయి బలపడుతుంది. అప్పుడే చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా స్థిరమైన తయారీకేంద్రంగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయి.   భారతదేశం ప్రపంచ వృద్ధి కీలక చోదక శక్తిగా ఎదుగుతోంది. ఈ వేగాన్ని తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా నిలబెట్టుకోవాలి.   

సేకరణ, సంకలనం : సీతారాం కంఠంనేని
 

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.