ఉత్కంఠ పోరులో గెలిచిన ముంబై ఇండియన్స్

Publish Date:Apr 10, 2012

Advertisement

ఐపిఎల్ 5 2012: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై జట్టు 5 వికెట్ల తేడాతో చార్జర్స్‌పై గెలిచింది. రోహిత్ శర్మ (50 బంతుల్లో 73 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో, ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి మరీ ముంబైని గెలిపించాడు.139 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి గెలిచింది.


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డెక్కన్ చార్జర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (24 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ముంబై బౌలర్లపై మెరుపుదాడి చేశాడు. క్రిస్టియాన్ (36 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించినా... ముంబై బౌలర్లు పుంజుకుని వికెట్లు తీసి చార్జర్స్‌ను అడ్డుకున్నారు. స్లాగ్ ఓవర్లలో వైట్ (22 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ముంబై బౌలర్లలో మునాఫ్ పటేల్ నాలుగు వికెట్లు తీసుకోగా... మలింగ మూడు, పొలార్డ్ 2 వికెట్లు పడగొట్టారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.