ఇండియాకు ఐఎమ్ఎఫ్ ఊతం!
Publish Date:Apr 15, 2026
Advertisement
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య కూడా భారత్ జీడీపీ వృద్ధి అంచనాను అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ (ఐఎమ్ఎఫ్) పెంచింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు, గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సానుకూల అంచనాలు వెలువరించడం విశేషం. రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను భారత్ జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతంగా పేర్కొంది. 2027, 2028 ఆర్థిక సంవత్సరాలలో భారత్ జీడీపీ వృద్ధి 6.5 తాతానికి ఐఎమ్ ఎఫ్ పెంచిన నేపథ్యంలో ప్రధాన ఆర్థక వ్యవస్థల్లో భారత్ అగ్రస్థానంలో నిలబడింది. అంటే వచ్చే రెండేళ్లలో కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. - అయితే.. 2026లో ప్రపంచ ఆర్థిక వృద్ధిపై తన అంచనాలను ఈ సంస్థ తగ్గించింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ, వస్తు మార్కెట్లను అస్థిరపరిచి, ధరలను పెంచడం ద్వారా ప్రపంచ ఆర్థిక గమనాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అది హెచ్చరించింది. ఈ ఘర్షణల కారణంగా చమురు, గ్యాస్ మరియు ఎరువులు వంటి కీలక వస్తువుల ధరలు పెరిగాయి. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య రవాణాకు అత్యంత కీలక మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'గుండా జరిగే రాకపోకలను ఇరాన్ సమర్థవంతంగా అడ్డుకోవడం ఇందుకు ఒక ప్రధాన కారణం. అదే సమయంలో, ఇరాన్ నౌకాశ్రయాలను లక్ష్యంగా చేసుకుంటూ నావికా దిగ్బంధనాన్ని అమలు చేయాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఫలితంగా.. ఈ సంవత్సరం ప్రపంచ ద్రవ్యోల్బణం 4.4 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ ఇప్పుడు తాజాగా అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలలో మొత్తం మార్పులు సాపేక్షంగా పరిమితంగా ఉన్నప్పటికీ, ఈ సంఘర్షణ ప్రభావాలు మధ్యప్రాచ్యంలో, మరింత బలహీనమైన ఆర్థిక వ్యవస్థలలో చాలా ఎక్కువగా ఉన్నాయని ఐఎంఎఫ్ హెచ్చరించింది. సేకరణ, సంకలనం : సీతారాం కంఠమనేని
ఐఎమ్ఎఫ్ తాజా నివేదిక ప్రకారం.. భారత్ రాబోయే రెండేళ్లలో కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుంది.
ప్రధాన ఆర్థిక వ్యవస్థల జీడీపీ వృద్ధి అంచనాలు ఇలా ఉన్నాయి.
- భారత్ 6.5శాతం
- చైనా 4.4శాతం
- అమెరికా 2.3శాతం
- రష్యా 1.1శాతం
- ఫ్రాన్స్ 0.9శాతం
-జర్మనీ 0.8శాతం
- బ్రిటన్ 0.8శాతం
- జపాన్ 0.7శాతం
- ఇటలీ 0.5శాతం
ఈ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
గ్లోబల్ వృద్ధి అంచనాను 3.3 నుంచి 3.1శాతానికి తగ్గించిన ఐఎమ్ఎఫ్ అందుకు కారణాలు కూడా వివరించింది.
- ఇరాన్ పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు
- ఇరాన్ ప్రతీకార చర్యలు
- హార్ముజ్ జలసంధిగుండా రవాణా అంతరాయం
- చమురు, గ్యాస్, ఎరువుల ధరల పెరుగుదల
- ద్రవ్యోల్బణం పెరుగుదల
అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ ప్రకారం, ఈ ఏడాది ప్రపంచ ద్రవ్యోల్బణం 4.4 శాతానికి కి చేరే అవకాశం ఉంది గతఅంచనాతో పోలిస్తే 0.6శాతం ఎక్కువ.
ఇంధన ధరలు సంవత్సరం పొడవునా అధికంగా ఉంటే, ప్రపంచ వృద్ధి రెండు శాతం వరకు పడిపోవచ్చని ఐఎంఎఫ్ హెచ్చరించింది. 1980 తర్వాత కేవలం నాలుగు సందర్భాల్లో మాత్రమే ప్రపంచ వృద్ధి 2శాతం కంటే దిగువకు పతనమైంది. అది కూడా 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి వంటి సందర్భాల్లో మాత్రమే.
ఇక పోతే అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థలపై కూడా అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ విశ్లేషించింది.
- అమెరికావృద్ధి అంచనా 2.3 శాతంగా పేర్కొంది.
- గ్యాసోలిన్ ధరలు పెరిగినా, అధిక ఇంధన ధరలు అమెరికాకు కొంత ప్రయోజనం కలిగించవచ్చని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది.
- ఇక 2026 వృద్ధి అంచనా: 4.4శాతంగా పేర్కొంది.
- దేశీయ డిమాండ్ కంటే ఎగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల అసమతుల్యత కొనసాగుతోందని పేర్కొంది.
ప్రపంచ చమురు రవాణాలో 20శాతం కంటే ఎక్కువ భాగం హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. అయితే ఇరాన్, ఆ తరువాత అమెరికా అమెరికా నావికాదళ దిగ్బంధన ఆదేశాల కారణంగా గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. అయితే ఈ పరిస్థితులలో కూడా భారత్ వృద్ధి అంచనాను ఐఎమ్ఎఫ్ పెంచడం సానుకూల సంకేతమనే చెప్పాలి.
- ఐఎమ్ ఎఫ్ అంచనాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతాయి
- గ్లోబల్ అస్థిరత మధ్య భారత్ స్థిరమైన వృద్ధి చూపుతోంది
- అమెరికా సుంకాల తగ్గింపు భారత ఎగుమతులకు లాభం
- భారత్ ను అంతర్జాతీయ సంస్థలుగ్లోబల్ గ్రోత్ ఇంజిన్ గా చూస్తున్నాయి.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ ద్రవ్యోల్బణం, సరఫరా చెయిన్ సమస్యలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ ఇండియాపై చూపుతున్న విశ్వాసం అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంకేతంగా ప్రపంచ ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో కూడా ఇండియా ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. మధ్యప్రాచ్య సంఘర్షణ ఉన్నప్పటికీ, భారత్ జీడీపీ వృద్ధి అంచనాను పెంచడం గ్లోబల్ మార్కెట్ లో భారత్ బ్రాండ్ విలువను పెంచిందనడంలో సందేహం లేదు.
- ప్రస్తత ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ వృద్ధిని 3.1 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. జనవరిలో జారీ చేసిన 3.3 శాతం అంచనాతో పోలిస్తే ఇది తగ్గింపు. ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ఉద్రిక్తతలు పెరగడం, దీనికి ప్రతిగా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడటంతో ఆ ప్రాంతమంతటా సంఘర్షణ విస్తరించడం వంటి పరిణామాలకు ముందే 3.3 శాతం అంచనా వెలువడింది. ఈ సంఘర్షణ లేకపోయి ఉంటే, 2026 నాటి వృద్ధి అంచనాలను 3.4 శాతానికి పెంచి ఉండేవాళ్ళమని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త పియరీ ఆలివియర్ గౌరిన్చాస్ పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/imf-boost-for-india-36-217404.html





