స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్టు

Publish Date:Apr 15, 2026

Advertisement

తెలుగు హీరోలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన నేపథ్యంలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను పోలీసులు అరెస్టు చేశారు.  మూడు రోజుల క్రితం జరిగిన ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో తెలుగు హీరోలను కించపరుస్తూ అనుదీప్ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలతో షోకు హాజరైన కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుదీప్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి దాడి చేసేందుకు ప్రయత్నించారు.   పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అనుదీప్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ ఘటన తర్వాత రెండు రోజులకే, తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ అనుదీప్ ఒక వీడియో విడుదల చేశారు. అయితే వివాదం ఇక్కడితో ఆగలేదు. అతని వ్యాఖ్యలు  రాజకీయ రంగు పులుముకున్నాయి.  తన కుటుంబాన్ని కలిసేందుకు ప్రయాగ్‌రాజ్ వెళ్లిన   అనుదీప్ కటికలను మంగళవారం (ఏప్రిల్ 14) ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ పోలీసులు ప్రత్యేక బృందాలతో అతని ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసి మంగళవారం (ఏప్రిల్ 14)   తన తండ్రితో కలిసి ఒక పార్కులో ఉన్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం  కాకినాడకు తరలించినట్టు తెలుస్తోంది.

ఇటీవల నిర్వహించిన స్టాండ్-అప్ కామెడీ షోలో టాలీవుడ్ నటులు, అభిమాన సంస్కృతిపై అనుదీప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడు కాకినాడలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.  ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. 

By
en-us Political News

  
మట్టి లేకుండానే పంట.. ఇండోర్ సాగులో సరికొత్త రికార్డు సృష్టించిన యువ రైతులు.
రఘురామ కృష్ణరాజు ఆకివీడు రామాలయం అంశంపై బుధవారం హైకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించటం చర్చనీయాంశమైంది.
పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై ఇటీవల వెలువడుతున్న స్కాం ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోల సృష్టి మరియు వ్యాప్తిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కూట‌మి ప్ర‌భుత్వం కృషితో క్రీడావికాసం సాధ్య‌మ‌వుతోంద‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో ఉన్న సామాజిక పరిస్థితులు వేరు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు వేరని వారు వాదిస్తున్నారు. కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల, అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారి వాదనలో వ్యక్తమవుతోంది. ఆర్థిక అసమానతల అంశంపై చర్చ తీవ్రమవుతున్న తరుణంలో.. కులం కంటే ఆర్థిక స్థితే ముఖ్యం అనే నినాదం బలంగా వినిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చినప్పటికీ, జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.
మీసేవ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు.
అథ్లెటిక్స్ ప్రపంచంలో పరుగు అంటేనే గుర్తొచ్చే పేరు ఉసేన్ బోల్ట్. ఆయన సృష్టించిన రికార్డులు దశాబ్ద కాలంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి.
ఇరాన్ తో అమెరికా యుద్ధం అన్నది ఒక పెద్ద వ్యూహంలో చిన్న ఆటవిడుపు మాత్రమే అంటున్నారు అంతర్జాతీయ వ్యూహకర్తలు. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ, ఒక భారీ వ్యూహంలో భాగమైన చిన్న చిన్న ఘర్షణలు మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అసలు సిసలు యుద్ధం అగ్రరాజ్యం అమెరికాకు, వేగంగా పురోగమిస్తూ.. అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతున్న చైనాకు మధ్య జరుగుతోంది.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
వెనిజులాలో రాజకీయ మార్పులు అక్కడి నుంచి చమురు సరఫరా అంతరాయం. ఇరాన్ లో ఘర్షణలు, చమురు ఎగుమతులు దెబ్బతినడం. రష్యాపై ఆంక్షలు, సరఫరా పరిమితి, సౌదీ ఉత్పత్తి తగ్గుదల, ధరలు పెరుగుదల. వీటి ఫలితంగా.. చైనా రోజువారీ చమురు దిగుమతుల్లో 20 శాతం తగ్గుదల. ఇది చైనా ఆర్థిక ఇంజిన్ కు పెద్ద దెబ్బ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.