సెల్‌ఫోన్‌ చోరీ.. బ్యాంకు ఖాతాలు ఖాళీ..!

Publish Date:Aug 26, 2026

Advertisement

 

హైబ్రిడ్‌ సైబర్‌ ఫ్రాడ్‌పై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరిక..!

సెల్‌ఫోన్లు చోరీ చేసి.. వాటి స్క్రీన్‌ లాక్‌ పిన్‌, పాస్‌వర్డ్‌లను తెలుసుకుని ఓటీపీల సాయంతో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న ‘హైబ్రిడ్‌ సైబర్‌ ఫ్రాడ్‌’ ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వారిని ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటికేహైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి, ఐదు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే బస్సులు, బహిరంగ ప్రదేశాల్లో ఫోన్‌ వినియోగించే వ్యక్తులను ముందుగా గమనించి, వారు స్క్రీన్‌ లాక్‌ పిన్‌ లేదా ప్యాటర్న్‌ ఎలా వేస్తున్నారో నిందితులు తెలుసుకుంటున్నారు. అనంతరం అదును చూసి ఫోన్‌ను చోరీ చేస్తున్నారు.

ఫోన్‌ లాక్‌ అయి ఉంటే బాధితుడికి కాల్‌ చేసి తాము బస్సు కండక్టర్‌ లేదా డ్రైవర్‌నని, ఫోన్‌ దొరికిందని నమ్మించి పాస్‌వర్డ్‌ చెప్పించుకుంటున్నారు. ఫోన్‌ అన్‌లాక్‌ అయిన తర్వాత గ్యాలరీ, నోట్స్‌, మెసేజ్‌లు, వాట్సాప్‌లోని వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను సేకరిస్తున్నారు. చోరీ చేసిన సిమ్‌ ద్వారా ఓటీపీలను పొంది యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఖాతాలను యాక్సెస్‌ చేసి నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్‌ వాలెట్లు, మ్యూల్‌ ఖాతాల ద్వారా నగదును మళ్లించి చివరకు డ్రా చేసుకుంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముఠాలు బాధితులను గుర్తించడం, ఫోన్లు చోరీ చేయడం, పాస్‌వర్డ్‌లు రాబట్టడం, నగదు బదిలీ చేయడం వంటి పనులను వేర్వేరు వ్యక్తులతో చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఫోన్‌ పోయినప్పుడు ఎవరైనా తిరిగి ఇస్తామని చెప్పినా స్క్రీన్‌ లాక్‌ పిన్‌, పాస్‌వర్డ్‌, బ్యాంకింగ్‌ ఓటీపీలు చెప్పకూడదని సీపీ సూచించారు. ఏటీఎం, డెబిట్‌ కార్డు ఫొటోలు, సీవీవీ, బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లు, ఆధార్‌, పాన్‌ వివరాలను ఫోన్‌లో భద్రపరచకూడదన్నారు. ఫోన్‌ పోయిన వెంటనే సిమ్‌ను బ్లాక్‌ చేయించి, బ్యాంకింగ్‌, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలి. CEIR పోర్టల్‌ ద్వారా ఫోన్‌ను బ్లాక్‌ చేయించాలి. ఖాతా నుంచి నగదు పోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930కు కాల్‌ చేసి, సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ వీసీ సజ్జనర్‌ సూచించారు.

 

Hybrid Cyber Fraud, CP V.C. Sajjanar, Hyderabad police, CEIR Portal, Cybercrime, DGP C.V. Anand, CM Revanth reddy

By
en-us Political News

  
లంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉ:ది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా..?
తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి..!
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిన్న నర్స్ శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
హైదరాబాద్‌ నగరంలోని ఫిలింనగర్‌ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
నీట్ పీజీ లో మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో  ఉంటూ ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు నిరంతరం శ్రమించేది. అయితే..  రోజువారీ టెస్ట్ సిరీస్‌లలో వస్తున్న మార్కులతో నిరాశ చెందింది.
న్న దుకాణంలో వచ్చే పరిమిత సంపాదనతో సంతృప్తి చెందకుండా.. అడ్డదారి తొక్కాడు.    గంజాయి చాక్లెట్ల విక్రయాల వైపు అడుగులు వేశాడు.
స్థానిక బౌద్ధాభిమాని రవికుమార్ రెడ్డి లట్టుపల్లి చొరవ, సహకారంతో   ఆయన అమెరికా   ఫిలడెల్ఫియాలో ఉన్న మోంగ్ కుల్ తెప్ మునీ  బౌద్ధ విహార, ఫొషో బౌద్ధలయం సందర్శించారు.
నాలుగు దశాబ్దాలుగా పరారీలో ఉన్న వీరన్నకు సహకరించిన వ్యక్తులు ఎవరు, చట్టం కళ్లుగప్పి.. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉద్యోగం ఎలా సంపాదించగలిగాడు అన్న విషయాలపై అధికారులు విచారణ చేపట్టారు. దశాబ్దాల పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో  ఎలా కొలువుదీరాడనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.  
తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.