మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో మరో నిందితుడు అరెస్ట్..!

Publish Date:Aug 26, 2026

Advertisement

 

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మవారి దేవాలయంలో మైనర్ బాలికపై ఒక వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు వృద్ధుడైన సాయన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం నేపథ్యంలో మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రాపురం ప్రాంతంలో ఉన్న ఓ ఆలయానికి బయట నుంచి తాళం వేసి లోపల ఒక వృద్ధుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతుండగా స్థానికులు గమనించి వెంటనే అతని పట్టుకున్నారు. ఆ వృద్ధుడు ఆ సాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న దృశ్యాలను స్థానికులు వీడియోగా రికార్డు చేశారు.

ఆలయంలో అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాయన్న @ సాయిలు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో స్థానికులు వెంటనే అతని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సాయన్న ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా  మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈకేసులో వృద్ధుడు సాయన్న, రవి అనే ఇద్దరు నిందితులకు మైనర్ బాలికతో గతంలోనే పరిచయం ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 13 ఫిబ్రవరి 2025న బాలికను యాదగిరిగుట్టకు తీసుకెళ్లిన ఘటనకు సంబంధించిన అంశాలు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో పోలీసులు ఇద్దరు నిందితులపై క్రైమ్ నంబర్ 505/2026*లో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు **POCSO Act-2012, **SC/ST (POA) Amendment Act-2015* కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బిల్లె రవి(46)ని ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.మైనర్ బాలికకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

 

Sexual assault on a minor girl, POCSO Act, BNS, Cyberabad Police, Sayanna, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy

By
en-us Political News

  
అమెరికాలోని మేరీల్యాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన నిఖిత గోడిశాల అనుమానాస్పదంగా మృతి చెందింది.
హైబ్రిడ్‌ సైబర్‌ ఫ్రాడ్‌పై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరిక..!
పెళ్లి మండపంలో సాధారణంగా వరుడు వధువు మెడలో మంగళసూత్రం కడతాడు.
అమెరికా కలలు కంటూ విదేశీ గడ్డపై అడుగుపెట్టిన ఆ యువకుడి భవిష్యత్తు ఒక్క క్షణంలో ముగిసిపోయింది.
పెళ్లి ప్రస్తావన తీసుకురాగా పవన్ నిరాకరించారనీ, ముఖం చాటేశారనీ, తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.  
ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.   ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించారు.
శంషాబాద్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్‌..!
ముషీరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేసిన సురేఖ కుమార్తె సుస్మితను ఇకపై కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంచాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ఇక పోతే.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తాను  జోక్యం చేసుకోకుండా విషయాన్ని అధిష్టానానికి వదిలేయడం ద్వారా   ఈ   వివాదానికి   త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.