కొత్త మాఫియా...భక్తి మాఫియా పార్ట్-2

Publish Date:May 13, 2016

Advertisement

 

ఇంతక్రితం ఉదయం పూట టీవీ పెట్టగానే వేంకటేశ్వర సుప్రభాతమో లేదా హనుమాన్ చాలీసానో వినిపించేవి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడు ఉదయం ఎక్కడ చూసినా స్వామీజీల ప్రవచనాలు..సూక్తులు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఒక్కటే..! పబ్లిసిటి. అన్ని వ్యాపారాల్లో లాగే భక్తి వ్యాపారంలోనూ పోటి ఉంది. అందుకే జనాన్ని ఆకర్షించడానికి మంత్రాలు, తంత్రాలు చేసి వాళ్లను తమ ఆశ్రమాల దాకా రప్పిస్తున్నారు. అయినా సరిపోక కోట్ల రూపాయల డబ్బు కుమ్మరించి ఛానెళ్లలో కమర్షియల్ స్లాట్స్ బుక్ చేస్తున్నారు. కాని అందరికి ఒకటే టైం కావాలి. ఆ స్లాట్స్‌ని తమ సొంతం చేసుకోవడానికి అవసరమైతే సంవత్సరంలోని అన్ని ఏపిసోడ్స్‌కి ముందుగా అడ్వాన్స్‌ చెల్లించేందుకు కూడా వెనుకాడటం లేదు. అక్కడ కూడా పని జరగని పక్షంలో సొంతంగా ఛానెళ్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడయితే ఉదయం నుంచి రాత్రి దాకా నాన్‌స్టాప్‌గా డబ్బా కొట్టుకోవచ్చు.

 

ఇదివరకటి రోజుల్లో ఏ రాజకీయ పార్టీల నాయకులో..బడా వ్యాపార వేత్తలో..రియల్ ఎస్టేట్ కింగ్‌లో తమ వ్యక్తిగత అవసరాల కోసమో..లేక ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టడానికో సొంత ఛానెళ్లని ఏర్పాటు చేసుకునేవారు. కాని నోరు తెరిస్తే భౌతికమైనవి మేము ఆశించం. మాకు విశ్వమానవ శ్రేయస్సే ముఖ్యమంటూ పిచ్చి ప్రవచనాలు చెప్పే ఈ కుహనా స్వాములకు ఛానెళ్ల అవసరం ఎంటి? ఒక శాటిలైట్ టీవీ ఛానెల్ పెట్టాలంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న పరిస్ధితుల్లో 200 నుంచి 300 కోట్లు కావాలి. సంచుల్లో బూడిద తప్ప ఇంకేమి లేదని కూసే ఈ స్వాములకు అంత డబ్బు ఎక్కడిది . ఇదంతా అవినీతి సంపాదన కాదా..? లేక ఏ వ్యాపారాలు చేయకుండానే అంత కూడబెట్టారా అంటే సమాధానం శూన్యం.  ఇంతకు ముందు ఏ సత్యసాయి నిగమాగమంలోనో, లేదంటే ఏ తుమ్మ్లపల్లి వారి కళాక్షేత్రంలోనే సత్సంగాలు ఏర్పాటు చేసేవారు. అయితే తమ భక్తి వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే మరింత మంది జనానికి తమ గురించి తెలియాలి. కేవలం వ్యాపారం చేసే వారే ప్రజలకు తమ ప్రొడక్ట్ తెలియాలనుకుంటారు. అందుకే టీవీ ఛానెళ్లలో ప్రకటనలు ఇస్తారు. మరి స్వామీజీలు స్లాట్స్ బుక్ చేయడం, ఛానెళ్లు పెట్టడం చూస్తే ఇదంతా వ్యాపారం కోసం చేస్తున్నారనుకోవాలి.  

 

తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ మతాన్ని వ్యాప్తి చేస్తున్న ప్రముఖ స్వామీజీ ఇటీవలే ఒక ఛానెల్‌లో కొంతవాటాను సొంతం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి "భారత్‌టుడే"అని సొంతంగా భక్తి ఛానెల్‌ను ప్రారంభించారు. వీటితో తమ గురించి డబ్బా కొట్టుకోవడంతో పాటు తమకు పోటి వస్తున్న వారికి వ్యతిరేకంగానూ ఉపయోగిస్తున్నారు. భూకబ్జాలు, డ్రగ్స్, లైంగిక ఆరోపణలతో తెలుగునాట సంచలనం సృష్టించిన కల్కి లీలల గురించి అప్పట్లో ప్రతి టీవీ ఛానెళ్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను తిప్పికొట్టాలంటే తనకు సొంత మీడియా ఉండాలని భావించిన కల్కి ఒక టీవీ ఛానెల్ ప్రారంభించాడు. దీని ద్వారా తనకు వ్యతిరేక వార్తలు రాసే వారి పనిపట్టే స్కెచ్ గీశాడు.

 

ఇదంతా పక్కన బెడితే స్వాములకు , స్వాములకు మధ్యే పడటం లేదు. బుధవారం నాడు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంఘటనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. సాయిబాబా భక్తుడు సిద్ధగురు శ్రీరమణానంద మహర్షి ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. ద్వారక పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సాయిబాబాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రచించిన "నాతో వాదనకు దైవశక్తి ప్రదర్శనకు సిద్ధమా" అనే గ్రంథావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ వార్త తెలుసుకున్న స్వర్ణహంపి పీఠాధిపతి గోవిందానంద సరస్వతి వాగ్వివాదానికి దిగారు. "సాయిబాబానే అవమానిస్తారా" అని ఒకరు "ఆదిశంకరాచార్యులనే అవమానిస్తారా" అని ఒకరు తీవ్రవాగ్వాదానికి దిగారు. ఇదే రమణానందకు తెలుగునాట ప్రవచనాల సామ్రాట్‌గా పేరొందిన చాగంటి సోమయాజీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

 

తాను షిరిడీ సాయిపై చెప్పిన మాటకు విరుద్ధంగా చాగంటి ప్రవచనాలున్నాయని రమణానంద కక్ష పెంచుకున్నారు. రమణానంద తన చేతిలో ఉన్న శివశక్తిసాయి అనే టీవీ ఛానెళ్లో చాగంటి మీద దుష్ప్రచారం చేయించడం, కొంతమంది తన అనుచరుల చేత చాగంటికి వ్యతిరేకంగా రోడ్లెక్కించడం చేశారు. రాగద్వేషాలు వదిలించుకోవాలని మనకి చెప్పే స్వాములే వాటికి లొంగిపోతే ఎలా? ఇంతకీ స్వామీజిల ప్రేమ దేని మీద హిందూ మతం మీదా.. హిందూ మతాన్ని నమ్మే ప్రజల మీద..లేక ప్రజల డబ్బు మీదా.? రాజకీయ నాయకులో, పారిశ్రామికవేత్తలో కోట్లకు  కోట్లు అవినీతి చేశారంటూ గోల గోల చేసే రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్య సంస్థలకు భక్తి ముసుగులో స్వామిజీలు కూడబెడుతున్న కోట్లు కనిపించడం లేదా..? ఒక వేళ ప్రశ్నిస్తే ఏమైనా పాపం చుట్టుకుంటుందని భయమా? అలా భయపడుతున్నంత కాలం మార్కెట్‌లోకి రోజుకొక కొత్త బాబా పుట్టుకొచ్చి వేల కోట్లకు అధిపతి అవుతాడు. 

 

దేశంలో వేలకోట్లకు అధిపతులైన స్వామీజీలు:

 

నిత్యానంద:

 

తమిళ సినీనటి రంజితతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొని ఫుల్ ఫేమస్ అయిన నిత్యానంద కొన్ని కోట్లకు అధిపతి. ఆయన వద్ద సుమారు 2 వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నట్లు ఏకంగా సీఐడీ దర్యాప్తులో తేలింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో 100 ఎకరాల స్థలంతో పాటు, అమెరికా, మలేషియా తదితర 33 దేశాల్లో వెయ్యికి పైగా ఆశ్రమాలు ఉన్నాయి. మహిళా భక్తులపై అత్యాచారాలు చేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

 

స్వామి రాంపాల్ బాబా:

 

హర్యానాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రాంపాల్. డిప్లోమా వరకు చదివి కొంతకాలం ప్రభుత్వంలో ఉద్యోగం వెలగబెట్టాడు. దానిని వదిలిపెట్టి బాబా అవతారమెత్తి.. తనను తాను కబీర్ ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. హిస్సార్‌లో మనోడీకి 12 ఎకరాల్లో సువిశాల సామ్రాజ్యం ఉంది. మొన్నటి మొన్న లైంగిక వేధింపుల కేసుల అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్ని తన ప్రైవేట్ సైన్యం చేత అడ్డగించాడు. వారిని చేధించుకుని కోటలోకి అడుగుపెట్టిన పోలీసులకు స్వామి వారి వైభోగం చూసి కళ్లు బైర్లుకమ్మాయి. ఇంధ్ర  భవనాల్ని తలపించే ఆశ్రమాలు, బంగారు సింహాసనాలు అబ్బో ఎంత చెప్పినా తక్కువే.

 

ఆశారాం :

 

మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులో అరెస్టై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు ఆశారాం బాపూజీ. భక్తుల వద్ద వసూలు చేసిన విరాళాలతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే కాదు...అమెరికాలోని కొన్ని సంస్థల్లో కూడా అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. ఈయనగారి వ్యక్త్తిగత ఆస్తులు 350 కోట్లుకాగా, అతని పేరిట బినామీ ఆస్తులు దాదాపు రూ.10 వేల కోట్ల వరకూ ఉండవచ్చని ఈడీ అంచనా.

 

బాబా రాందేవ్:

 

దేశంలో ప్రముఖ యోగా గురువుగా పేరుగాంచిన బాబా రాందేవ్‌పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. యోగా, ప్రవచనాలు చెప్పుకునే బాబాకి అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రధాన అనుచరుడు ఆచార్య బాలకృష్ణన్ ప్రకటించిన లెక్కల మేరకు రాందేవ్ వ్యాపార సామ్రజ్యం విలువ 1,100 కోట్ల రూపాయలుగా వెల్లడైంది. ఈయన గారికి సొంత టీవీ ఛానెల్ ఉంది దాని పేరు ఆస్థా. 

 

కల్కిభగవాన్:

 

కల్కి భగవాన్ ఆలియాస్ "విజయ్ కుమార్". డ్రగ్స్‌, భూదందాలు ఇలా ఈయనగారి ఆశ్రమంపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చిత్తూరు , నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఆశ్రమం ప్రక్కల ఉన్న భూమిని కల్కి ఆక్రమించాడని ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. వివిధ దర్శనాలు, పూజల పేరుతో భక్తులను నిలువు దోపిడి చేస్తున్నట్టు మీడియా కథనాలు ప్రచురించింది. తనపై వచ్చే ఆరోపణలను తిప్పికొట్టడానికి కల్కిభగవాన్ ఓ టీవీ ఛానెల్‌ని స్థాపించాడు. 

 

బాబా గుర్మీత్ రామ్ రహీమ్:

 

బాబా గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా. సిక్కు మతంలోని ఒక శాఖ" డేరా సచ్చా సౌదా"కు ఈయన అధిపతి. భక్తులు యిబ్బడిముబ్బడిగా విరాళాలు ఇవ్వడంతో వాటితో డేరా అనేక స్థిరాస్తులు కొని, అనేక వ్యాపారాల్లో దిగాడు. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆర్గానిక్ ఫామ్స్, కాలేజీలు, రిటైల్ స్టోర్సు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, రిసార్టులు, హోటల్స్, మీడియా, క్రికెట్ స్టేడియాలు అబ్బో బాబాగారి వ్యాపార సామ్రాజ్యం అంతా ఇంతా కాదు. డేరా తన సంపదతో ప్రభుత్వాలను సైతం శాసించగలుగుతున్నాడు. 50 మంది వరకూ మహిళా భక్తురాళ్లపై అత్యాచారం చేసినట్టు ఇతనిపై ఆరోపణలు వచ్చాయి.

 

ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్:

 

మనిషి ఒత్తిడిని తగ్గిస్తామంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపించిన పండిట్ రవిశంకర్ తన శక్తి, సామర్థ్యాలతో పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఎఓఎల్ ఫౌండేషన్ ఒక ప్రభుత్వేతర సంస్థ. విదేశాల నుంచి వచ్చే నిధులు దీనికి ప్రధాన తైలం. 156 దేశాల్లో విస్తరించిన కార్యకలాపాల ద్వారా దాదాపు 1,000 కోట్ల ఆస్తులను రవిశంకర్ ఫౌండేషన్ కూడబెట్టిందని అంచనా. 

 

మేము భగవంతుడికి, భక్తులకు మధ్య అనుసంధానకర్తలం మాత్రమే, మాకు భార్య, పిల్లలు, ఆస్తి, పాస్తి ఏమి లేవంటారు. అలాంటి వారికి బంగారు సింహాసనాలెంటి..? హంస తూలికా తల్పాలెంటి..? సంసారాన్ని, బంధుమిత్రుల్ని త్యజించాం..మాకున్న తోడు దేవుడొక్కడే అని చెప్పే స్వాముల్లో ఇప్పటికీ తన కుటుంబసభ్యులతో "బంధాన్ని" కొనసాగిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. మనకి మాత్రం ముక్తి పొందాలంటే బంధాలన్ని వదిలిపెట్టాలని శ్రీరంగనీతులు వల్లిస్తారు. అయితే ఇలాంటి స్వాముల్లో కూడా గంజాయి వనంలో తులసి మొక్కల్లాంటి వ్యక్తులున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హైందవ మత వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు.  సింహాసనాల మీద కాకుండా పేడతో అలికిన నేల మీదే ఆయన దినచర్య సాగుతోంది. ఆఖరికి కారులో బయటకు వెళ్లేటప్పుడు కూడా చెక్క పీట మీదే కూర్చునేవారు.

 

మంచికి రోజులు లేనట్టు జయేంద్ర సరస్వతి మీద కూడా కేసులు మోపి, ఆయన్ను జైలుకి పంపారు. కాని నిజం దాస్తే దాగేది కాదు అందుకే న్యాయస్థానం కూడా ఆయనపై నమోదైన అభియోగాలు నిరాధారమైనవని నిర్దోషిగా విడుదల చేసింది. దీనిని బట్టి మతం, రాజకీయం సమ్మిళతమైపోయాయని అర్థం చేసుకోవచ్చు. జనానికి, రైతుకు మధ్య దళారులు, కార్యాలయాల్లో దళారులు, ఇలా ప్రతి పనికి దళారులున్నట్లే మనకి..దేవుడికి మధ్యలో స్వామీజీలు, బాబాలు అనే దళారులు ప్రవేశించారు. అయినా భగవంతుణ్ణి అందుకోవడానికి మనకు కావాల్సింది నిర్మలమైన మనసు, భక్తి ఈ రెండు ఆయుధాలతో చరిత్రలో ఎంతోమంది దేవుణ్ణి చేరుకున్నారు. కాబట్టి మనకు దళారులు అవసరం లేదు.

 

                                                                                                         సశేషం

కొత్త మాఫియా..భక్తి మాఫియా పార్ట్-1

By
en-us Political News

  
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.