గంటా మద్దతుతో రెచ్చిపోతున్న రామాంజనేయులు
Publish Date:Mar 22, 2012
Advertisement
విశాఖజిల్లా నుంచి ఎన్నికై మంత్రులుగా ఎదిగిన పసుపులేటి బాలరాజు, గంటా శ్రీనివాసరావు మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పటికే వీరి మధ్య ఉన్న ఆధిపత్యపోరు జిల్లా అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ పురోగతికి శాపంగా మారింది. ఇప్పుడు జివిఎంసి కమీషనర్ రామాంజనేయులు విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. రామాంజనేయులు కమీషనర్ గా ఉంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడనే ఉద్దేశంతో మంత్రి బాలరాజు ఆయనకు వ్యతిరేకించేవారు. జివిఎంసి కమీషనర్ గా ఉన్న రామాంజనేయులుపై స్పెషల్ ఆఫీసర్ గా ఆయనకన్నా జూనియర్ ను నియమించడంలో బాలరాజు సఫలమయ్యారు. దీంతో మనస్తాపానికి గురైన రామాంజనేయులు కొత్తగా మంత్రిపదవిని అధిష్టించిన గంటా శ్రీనివాసరావు పంచన చేరినట్లు తెలిసింది. బాలరాజుపై ఉన్న వ్యతిరేకతతో గంటా శ్రీనివాసరావు జివిఎంసి కమీషనర్ కు పూర్తి హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రామాంజనేయులు విశాఖ మహానగరంలో మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. ఇలా చేస్తే జిల్లాలో అధికారులు తనను ఎలా గౌరవిస్తారని బాలరాజు ఇప్పుడు ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/gvmc-commissioner-b-ramanjaneyulu-municipal-employees-vishakhapatnam-24-12837.html





