అనంత ఆంతర్యం ఏమిటి?
Publish Date:Mar 22, 2012
Advertisement
అనంతపురం ఇంపు అనంతవెంకటరామిరెడ్డి ఆంతర్యం అంతుపట్టక జిల్లా కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా అనంత అసెంబ్లీ టిక్కెట్ ను ఆశిస్తున్న ఆశావహులు తలలుపట్టుకుంటున్నారు. అనంతపురం అసెంబ్లీ కాంగ్రెస్ టిక్కెట్ ను పలువురు నాయకులు ఆశిస్తున్నారు. అయితే అక్కడ ఎవరికీ టిక్కెట్ దక్కాలన్నా ఎంపి అనంతవెంటకరామిరెడ్డి ఆశీస్సులు తప్పక ఉండాల్సిందే. నిజానికి అనంతవెంకటరామిరెడ్డి కుటుంబంలో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయీ తమ కుటుంబం నుంచి ఎవరో ఒకరిని పోటీకి నిలపడానికి అనంతవెంకటరామిరెడ్డి ఇప్పటివరకు ఆసక్తి చూపలేదు. మరోవైపు టిక్కెట్ ఆశిస్తున్న నాయకుల్లో ఏ ఒక్కరికి కూడా ఆయన మద్దతు ప్రకటించలేదు. ఆయన మౌనం జిల్లా నాయకులకు కలవరాన్ని కలిగిస్తోంది. ఇక్కడ పోటీచేయడానికి కాంగ్రెస్ నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి, రాగే పరుశురామ్, కోగటం విజయభాస్కరరెడ్డి, రషీద్ అహ్మద్, మల్లిఖార్హున్, కలియులాఖాన్ ప్రయత్నిస్తున్నారు. నిజానికి వీరిలో కొంతమంది అనంతవెంకటరామిరెడ్డి కుటుంబంలో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇస్తే పార్టీకి నష్టం కలుగుతుందని బహిరంగంగానే ప్రకటించారు. ఈ ప్రకటనలు అనంతవెంకటరామిరెడ్డికి బాధకలిగించినట్లు తెలిసింది. కానీ అధిష్టానం ఆదేశిస్తే అనంత కుటుంబంలో ఒకరు ఇక్కడ పోటీచేయడం ఖాయమని అనంత అనుచరులు అంటున్నారు. ఇదే జరిగితే పార్టీ టిక్కెట్ ను ఆశిస్తున్న ఇతర ఆశావహుల్లో కొందరు కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. జిల్లాలో మరో ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి తన వర్గానికి చెందిన కె.విజయభాస్కరరెడ్డికి టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఒకవేళ అతనికి టిక్కెట్ ఇవ్వకపోతే అనంతపురంలో బలమైన సామాజికవర్గానికి చెందిన పిఆర్పీ మాజీ నేత టిజె ప్రకాష్ ను బలపరుస్తున్నట్లు తెలిసింది. ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు చవ్వా రాజశేఖరరెడ్డికి మంత్రి రఘువీరారెడ్డి ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అనంతలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక అధిష్టానానికి కత్తిమీద సాములా మారనుంది.
http://www.teluguone.com/news/content/anantapuram-assembly-constituency-24-12835.html





