గుజరాత్‌లో కాంగ్రెస్‌‌కు ఉన్న ఆ ఒక్క ఛాన్స్ మిస్..?

Publish Date:Aug 7, 2017

Advertisement

ప్రస్తుతం దేశం మొత్తం గుజరాత్ రాజ్యసభ ఎన్నికల గురించే చర్చ. పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తోన్న సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ఎలాగైనా రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే గుజరాత్ నుంచి ఖాళీగా ఉన్న మూడు సీట్లు తమకే చెందాలని భావిస్తోన్న బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అహ్మద్‌పటేల్‌ను ఓడించేందుకు పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా అమిత్‌షా, స్మృతీ ఇరానీలకు తోడుగా మూడో అభ్యర్థిని పోటీకి పెట్టింది. గుజరాత్ అసెంబ్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ విప్ బల్వంత్ సింహ్ రాజ్‌పుత్‌ను అహ్మద్‌పటేల్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దింపింది. ఆయన గెలుపుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలను ప్రారంభించింది.

 

ప్రలోభాలకు లోనయ్యారో లేక భయపడ్డారో కానీ ఇప్పటి వరకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా మరికొందరు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. మిగిలి ఉన్న 44 మంది శాసనసభ్యులను తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకకు పంపి రక్షించుకునే ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే ఉండటం..ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉండటంతో మిత్రపక్షాల వైపు చూస్తోంది కాంగ్రెస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు పెట్టుకోవడం..ఆ ఎన్నికల్లో ఎన్సీపీకి చెందిన ఇద్దరు గెలుపొందడంతో వారి మద్ధతు తనకే లభిస్తుందని ఆశించిన హస్తానికి ఊహించని షాక్ ఇచ్చింది ఎన్సీపీ.

 

రాజ్యసభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్ధతు ఇచ్చే అంశంపై తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత ప్రపుల్ పటేల్ చెప్పడంతో కాంగ్రెస్‌ నేతలు ఉలిక్కిపడ్డారు. గత యూపీఏ కూటమిలో తమ పార్టీ లేదు..ప్రస్తుతం అలాంటి కూటమి కూడా కొనసాగడం లేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న మా పార్టీ మద్ధతు కోసం అందరూ రాయబారాలు నడుపుతున్నారని..కానీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో పార్టీ అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రపుల్ పటేల్ స్పష్టం చేశారు. అయితే ఎన్సీపీ కాంగ్రెస్‌కు మద్ధతు ఇవ్వకుండా బీజేపీ ఆ పార్టీని భయభ్రాంతుకు గురి చేసిందని..రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి న్యూట్రల్‌గా ఉన్న ఎన్సీపీ ఇప్పుడు ఉన్నపళంగా ఇలా మాట్లాడం పలు అనుమానాలకు తావిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదీ ఏమైనా ఎన్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు మద్ధతు ఇస్తుందని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

By
en-us Political News

  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.