చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రతినిధి, సామాజిక హక్కుల నాయకుడు గాదె ఇన్నయ్యకు నాంపల్లి కోర్టు రెండు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అధికారులు యూఏపీఏ కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, ఆరోగ్య కారణాలను చూపుతూ తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును ఆశ్రయిం చారు.
ఇన్నయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, ఆయన వ్యక్తిగత మరియు ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రెండు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. అయితే బెయిల్ గడువు ముగిసిన అనంతరం తిరిగి లొంగిపోవాలని కోర్టు స్పష్టం చేసింది. విడుదల సంద ర్భంగా కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కోర్టు వద్దకు చేరుకుని ఇన్నయ్య ను స్వాగతించారు.
ఇన్నయ్యకు మధ్యంతర బెయిల్ లభించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుతో ఆయన తాత్కా లికంగా జైలు నుండి బయటకు రావడానికి అవకాశం లభించింది. అయితే యు ఏ పి ఏ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు విధించిన అన్ని షరతులను పాటించాలని ఆదేశించినట్లు సమాచారం.. మద్యంతర బేలు పూర్తి అయిన తర్వాత తిరిగి ఆయనే అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది..ప్రస్తుతం ఆయన రెండు నెలలపాటు మధ్యంతర బెయిల్‌పై బయట ఉండనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gade-innayya-36-221974.html
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం
దాంపత్య బంధాన్ని కాపాడేది సహనం, సంభాషణే..