హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ హత్యకు కుట్ర..?

Publish Date:Aug 25, 2026

Advertisement

 

హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ రోజు ఉదయం మన్సూరాబాద్‌లో సత్యనారాయణ నిర్వహిస్తున్న రేషన్ షాప్ వద్ద నలుగురు యువకులు అనుమానాస్పదంగా గంటసేపు తిరుగుతూ కనిపించారు. యువకుల కదలికలపై అనుమానం వచ్చిన స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. మరో యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన యువకుడు తన పేరు గార్లపాటి అరవింద్ రెడ్డిగా పోలీసులకు చెప్పాడు. అంతేకాకుండా అరవింద్ రెడ్డిపోలీసుల ఎదుట కీలక విషయాలు వెల్లడించాడు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి పంపించడంతోనే తాము సత్యనారాయణపై రెక్కీ నిర్వహించేందుకు వచ్చినట్లు అతను చెప్పాడు. 

అయితే ఈ ఆరోపణలను పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.. ఇదిలా ఉండగా మరోవైపు గత కొంతకాలంగా బుడ్డ సత్యనారాయణకు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డితో వివాదం కొనసాగుతున్నది. ప్రభాకర్ రెడ్డిపై సత్యనారాయణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. సత్యనారాయణపై ఆగ్రహంతో ఉన్న శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలే ఈ రెక్కీ వెనుక ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు యువకులు సత్యనారాయణ రేషన్ షాప్ వద్దకు వచ్చి.. అతని కదలికలను గమనించడం, వారిలో ఒకరు పట్టుబడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై బుడ్డ సత్యనారాయణ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, తనపై హత్యకు కుట్ర జరిగిందని ఆరోపిస్తూ జక్కిడి శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఈ వ్యవహారంపై స్పందించిన గిరిజన సంఘాల నాయకులు... జక్కిడి శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలను వెంటనే అరెస్టు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. హత్య కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా వారు కోరారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పట్టుబడిన యువకుడి వాంగ్మూలం, రెక్కీకి వచ్చిన నలుగురు యువకుల వెనుక ఉన్న వ్యక్తులు, హత్యకు సంబంధించిన కుట్ర నిజంగా జరిగిందా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Market Committee Director  Budda Satyanarayana, Jakkidi Shivacharan Reddy, Jakkidi Prabhakar Reddy, Congress party, CM Revanth reddy

By
en-us Political News

  
అమెరికాలోని మేరీల్యాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన నిఖిత గోడిశాల అనుమానాస్పదంగా మృతి చెందింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మవారి దేవాలయంలో మైనర్ బాలికపై ఒక వృద్ధుడు లైంగిక దాడి
హైబ్రిడ్‌ సైబర్‌ ఫ్రాడ్‌పై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరిక..!
పెళ్లి మండపంలో సాధారణంగా వరుడు వధువు మెడలో మంగళసూత్రం కడతాడు.
అమెరికా కలలు కంటూ విదేశీ గడ్డపై అడుగుపెట్టిన ఆ యువకుడి భవిష్యత్తు ఒక్క క్షణంలో ముగిసిపోయింది.
పెళ్లి ప్రస్తావన తీసుకురాగా పవన్ నిరాకరించారనీ, ముఖం చాటేశారనీ, తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.  
ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.   ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించారు.
శంషాబాద్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్‌..!
ముషీరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేసిన సురేఖ కుమార్తె సుస్మితను ఇకపై కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంచాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ఇక పోతే.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తాను  జోక్యం చేసుకోకుండా విషయాన్ని అధిష్టానానికి వదిలేయడం ద్వారా   ఈ   వివాదానికి   త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.