ఈ నెల 12, 13వ తేదీల్లో సాగర తీరాన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026.!

Publish Date:Nov 10, 2026

Advertisement

ఏపీని పెట్టుబడులకు, పారిశ్రామికాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026ను ప్రభుత్వం నిర్వహించనుంది. గతేడాది నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు భిన్నంగా 2026 సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఇప్పటికే ఐదు ప్రాంతీయ సదస్సులు నిర్వహణతో రూ.86 వేల కోట్ల పెట్టుబడులను వచ్చాయి. అలాగే వివిధ రంగాలపై ప్రాంతీయ సదస్సుల్లో చర్చలు జరిగాయి. 

దీంతో పెట్టుబడుల సదస్సులో ఎలాంటి చర్చలు జరుగుతాయోననే అంశంపై అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థల అధినేతలు హాజరుకానున్నారు. 

రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని, వివిధ దేశాల ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశం కానున్నారు. నవంబర్ 12వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో సదస్సు ప్రారంభ కార్యక్రమం జరగనుంది. సదస్సు ప్రారంభం కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. 

ఆ తర్వాత జరగనున్న వివిధ సెషన్లు... సమావేశాల్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు భాగస్వాములు కానున్నారు. అలాగే కీలక సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొని... ఆయా అంశాలపై చర్చించడంతోపాటు... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అందుబాటులో ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విధానాలు, తయారీ, సాంకేతిక రంగాల్లోని అవకాశాలను పారిశ్రామిక వర్గాలకు సీఎం వివరిస్తారు. 

అంతర్జాతీయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీలు.!

సీఐఐ సమ్మిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి పలు దేశాల మంత్రులు, రాయబారులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్వాటెమాలా, స్లోవేకియా దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. అలాగే జపాన్, రష్యా రాయబారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. వీరితో పాటు ప్రపంచ మేధోసంపత్తి సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డారెన్ టాంగ్‌తో కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 

ఇక సదస్సులో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, నిర్మాణ సామగ్రి, మౌలిక సదుపాయాలు, మాన్యుఫ్యాక్చరింగ్, సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు భాగస్వాములు కానున్నారు. కియా మోటార్స్‌కు, రెన్యూ, మాండెలెజ్ ఇండియా, సెయింట్ గోబెయిన్, నాల్కో, లెవిస్టా వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు సదస్సులో భాగస్వాములు కానునున్నారు. ఇక సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా స్పేస్ రంగంలోని స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు నిలవనున్నారు. 

అంతరిక్ష సాంకేతికత, పరిశోధన, తయారీ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను విస్తరించే లక్ష్యంతో తేదీన ప్రముఖ భారతీయ ప్రైవేటు అంతరిక్ష సంస్థల ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో హాథోర్ రాకెట్స్, అగ్నికుల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, స్కైరూట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. అలాగే జపాన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ చైర్మన్‌తో సీఎం భేటీ అవుతారు. 

సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలోనే మహిళా సాధికారతకు ప్రాధాన్యతిస్తూ ఓ సమావేశం నిర్వించనున్నారు. దీనికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. 'విమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్–2026' పేరుతో విశాఖ నోవోటెల్‌లో ప్రారంభ కార్యక్రమం జరగనుంది. మహిళల ఆర్థిక సాధికారత, పారిశ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం, వ్యాపారవేత్తలుగా మహిళలకు ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు.

కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి వరుస భేటీలు.!


సదస్సులో వివిధ శాఖలకు చెందిన కేంద్రమంత్రులతో సీఎం ఈ రెండు రోజుల్లో సమావేశం కానున్నారు. వివిధ రంగాల్లో పారిశ్రామికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు... రాష్ట్రానికి అందించాల్సిన చేయూతపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలోని వివిధ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని వెసులుబాట్లు కల్పించే అంశాలను కేంద్రమంత్రుల వద్ద ప్రస్తావించనున్నారు. 

అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుతున్న పరిణామాలతో రాష్ట్రంలోని పలు రంగాలపై పడుతున్న ప్రభావాన్ని కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్‌, ప్రహ్లాద్ జోషి, సర్బానంద సోనోవాల్ వంటి వారితో సీఎం భేటీ కానున్నారు.

ఒకరోజు ముందే సీఎం సమావేశాలు.!


సమ్మిట్‌కు ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో అమరావతి, విశాఖల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. బుధవారం సింగపూర్ మంత్రి గాన్ సియో హువాంగ్‌తో అమరావతిలో సమావేశమవుతారు. అనంతరం విశాఖ చేరుకుని వివిధ భేటీల్లో పాల్గొంటారు. 

డబ్ల్యూఐపీవో డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, జపాన్ రాయబారి కీచి ఒనో, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ, రెన్యూ సంస్థ సీఈవో సుమంత్ సిన్హాలతో బుధవారమే సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం సీఐఐ సీఈవోలతో సమావేశం, అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన స్వాగత విందులో పాల్గొంటారు.

 

 

[ CII Partnership Summit 2026, Visakhapatnam, Chandrababu Naidu, Andhra Pradesh Investments, Amit Shah, Global Investors, Foreign Delegates, Industrial Development, Women and Growth Summit, Space Startups, Renewable Energy ]

By
en-us Political News

  
ఇటీవల పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన  ధర్నాకు సంబంధించి పోలీసులు జగన్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) శుభవార్త అందించింది.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అట్టడుగు వర్గాలకు అందుతున్న సేవలు, విద్యా, వైద్య రంగాలలో కల్పిస్తున్న సమాన అవకాశాల కారణంగానే ఏపీకి ఈ  ర్యాంక్ సాధ్యమైందని నిపుణులు, పరిశీలకులూ  విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న సంస్కరణల విధానం,  పాలనా దక్షత రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా నిలిచాయంటున్నారు.
హిట్ కొట్టాం అంటూ కేబినెట్ సమావేశంలో మంత్రుల నినాదాలు.!
 కడప నుంచి విజయవాడ 33 మంది ప్రయాణీకులతో వెడుతున్న   ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు    చుండి వద్దకు రాగానే బస్సు ముందు టైరు బరస్ట్ అయ్యింది. దీంతో   అప్రమత్తమైన డ్రైవర్, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు.
రెబల్స్‌ను పార్టీలో చేర్చుకోము..సీఎం కీలక వ్యాఖ్యలు.!
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడప జిల్లాలో కాంగ్రెస్‌తో హోరాహోరీగా తలపడిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠను రేకెత్తించిన గ్రామీణ స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల తుది ఘట్టం ముగిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ హవా.!
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి.
విశాఖ వేదికగా జరగనున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో అపారంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలకు బలంగా చాటిచెప్పాలన్నారు. విధాన రూపకర్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు,  స్టార్టప్స్  మధ్య బలమైన వారధిగా ఈ సదస్సు నిలవాలని చంద్రబాబు పేర్కొన్నారు.
మొత్తం 365 కౌంటింగ్‌ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని.. 19,885 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ నిఘాతో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీవోర్న్‌ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.