అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ఏపీ నంబర్ 2: యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడి.!

Publish Date:Nov 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమ రంగాలలో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. జాతీయ స్థాయిలో విడుదలైన తాజా యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్  నివేదికలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. తలసరి ఆదాయం పరంగా రాష్ట్రం కొంత వెనుకబడి ఉన్నప్పటికీ, ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడంలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంలో అనితర సాధ్యమైన ఫలితాలను సాధించిన ఆంధ్రప్రదేశ్ ఈ ఘనతను సొంతం చేసుకుంది.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు అన్నీఇన్నీ కావు. రాజధాని నిర్మాణం నుంచి మౌలిక వసతుల కల్పన వరకు అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటూనే ప్రభుత్వం ముందుకు సాగింది. అలా రాష్ట్రం గాడిలో పడుతున్న తరుణంలో రాష్ట్రంలో అధికారం మారింది. 2019 ఎన్నికలలో విజయం సాధించి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జగన్ సీఎం అయ్యారు. అంతే అక్కడితో ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణం దాదాపు నిలిచిపోయింది.

ఐదేళ్ల పాటు అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయింది. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికార పగ్గాలు అందుకుంది. చంద్రబాబునాయుడు మళ్లీ సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టారు. నిలిచిపోయి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.

సంపద సృష్టి జరుగుతోంది. అయితే, కేవలం సంపదను సృష్టించడం మాత్రమే కాకుండా, ఆ సంపదను ప్రతి ఒక్కరికి సమానంగా అందేలా చేయడమే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు తన పాలన ద్వారా నిరూపిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష తార్కాణమే  యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ లో ఏపీకి జాతీయ స్థాయిలో రెండో స్థానం. ఈ యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదిక వెలువడిన తర్వాత రాజకీయ, ఆర్థిక వర్గాలలో దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: ఏపీ కేబినెట్ భేటీలో సంబరాలు..సీఎం, డిప్యూటీ సీఎంలకు స్వాగతం.!

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అట్టడుగు వర్గాలకు అందుతున్న సేవలు, విద్యా, వైద్య రంగాలలో కల్పిస్తున్న సమాన అవకాశాల కారణంగానే ఏపీకి ఈ  ర్యాంక్ సాధ్యమైందని నిపుణులు, పరిశీలకులూ  విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న సంస్కరణల విధానం,  పాలనా దక్షత రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా నిలిచాయంటున్నారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ, ప్రణాళికాబద్ధమైన విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో రాష్ట్రం విజయవంతమైందని సోదాహరణంగా వివరిస్తున్నారు.

ఈ   గుర్తింపు ద్వారా ఏపీ పట్ల పెట్టుబడిదారులలో, జాతీయ సంస్థలలో సానుకూల దృక్పథం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.  కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా సామాజిక సమానత్వం కూడా సమాజ అభివృద్ధికి ఏపీ ఇస్తున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యతకు ఈ నివేదిక నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.   భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలను అమలు చేయడం ద్వారా మొదటి స్థానాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.  

మీకు నచ్చవచ్చు: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది: సీఎం చంద్రబాబు​

విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు: పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యం.!

[AP Number 2 in Developement and Welfare, Access Equality Index Reval,  AP ranks second, Access Equality Index, CBN Governance, AP Government, TeluguOne] 

By
en-us Political News

  
ఇటీవల పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన  ధర్నాకు సంబంధించి పోలీసులు జగన్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) శుభవార్త అందించింది.
ఏపీని పెట్టుబడులకు, పారిశ్రామికాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026ను ప్రభుత్వం నిర్వహించనుంది.
హిట్ కొట్టాం అంటూ కేబినెట్ సమావేశంలో మంత్రుల నినాదాలు.!
 కడప నుంచి విజయవాడ 33 మంది ప్రయాణీకులతో వెడుతున్న   ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు    చుండి వద్దకు రాగానే బస్సు ముందు టైరు బరస్ట్ అయ్యింది. దీంతో   అప్రమత్తమైన డ్రైవర్, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు.
రెబల్స్‌ను పార్టీలో చేర్చుకోము..సీఎం కీలక వ్యాఖ్యలు.!
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడప జిల్లాలో కాంగ్రెస్‌తో హోరాహోరీగా తలపడిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠను రేకెత్తించిన గ్రామీణ స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల తుది ఘట్టం ముగిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ హవా.!
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి.
విశాఖ వేదికగా జరగనున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో అపారంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలకు బలంగా చాటిచెప్పాలన్నారు. విధాన రూపకర్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు,  స్టార్టప్స్  మధ్య బలమైన వారధిగా ఈ సదస్సు నిలవాలని చంద్రబాబు పేర్కొన్నారు.
మొత్తం 365 కౌంటింగ్‌ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని.. 19,885 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ నిఘాతో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీవోర్న్‌ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.