కోర్టు వివాదాలు క్లియర్: 18 మునిసిపాలిటీలు, నాలుగు కార్పోరేషన్లను ఈ నెల్లోనే ఎన్నికలు.!
Publish Date:Nov 11, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో చట్టపరమైన ఆటంకాలు, కోర్టు వివాదాల కారణంగా నిలిచిపోయిన 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో, ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే దిశగా ఎన్నికల కమిషన్ కసరత్తు వేగవంతం చేసింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా మి సంస్థలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో, వివిధ న్యాయస్థానాలలో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున ఈ 23 స్థానిక సంస్థలలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ నెల 26న వీటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విడతలో 4 నగరపాలక సంస్థలు శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి తో పాటు 19 మునిసిపాలిటీలు నగర పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా స్థానిక సంస్థల పరిధిలో డివిజన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల రూపకల్పన ప్రక్రియలను అధికారులు పూర్తి చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా వర్గాలకు కేటాయించాల్సిన స్థానాల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కేటాయింపు పరిపాలనాపరమైన ఏర్పాట్ల జరుగుతున్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఇదిచదవండి: ఏపీలో మళ్లీ ఎన్నికల రణం: ఈ నెలలోనేపెండింగ్ మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు.! ఈ నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం, త్వరలోనే అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసి ఎన్నికల కోడ్‌ను అమలు చేయనుంది. స్థానిక పోలింగ్ నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఆయా పురపాలక వర్గాల్లో రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించడంతో స్థానిక ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారనుంది. మీకునచ్చవచ్చు: ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.! ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలపై ఎస్ఈసీ కీలక ప్రకటన.! [Court Disputes Clear, AP pending Municipalities, Elections23 Urban Local Bodies Polls, Andhra Pradesh Local Body Elections, Telugu One]
http://www.teluguone.com/news/content/court-disputes-clear-43-236849.html





