బంగాళాఖాతంలో మరో అల్పపీడం: తుపానుగా మారే అవకాశం.. ఏపీకి ముప్పు లేదు.!

Publish Date:Nov 11, 2026

Advertisement

బంగాళా ఖాతంలో మరో అప్పపీడనం ఏర్పడిందన్న వార్త వరుస తుపానులతో ఇప్పటికే అతలాకుతలమైన ఏపీ ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే రోజుల వ్యవధిలో అర్నాబ్, మురసు తుపానులతో ఏపీలో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. 

అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే రహదారులపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి, రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. ఇక వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా అస్తవ్యస్థంగా మారింది

ఆ ఇబ్బందులు, ఇక్కట్లను ఇప్పుడిప్పుడే  అధిగమించి గాడిన పడుతున్న ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనే సరికి బెంబెలెత్తుతోంది.  దక్షిణ అండమాన్ సముద్రం  దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

 ఇది వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి  స్పష్టమైన అల్పపీడనంగా  మారే అవకాశం ఉందనీ, . ఆ తర్వాత ఆదివారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కంది.  

ఇది చదవండి: ఏపీకి మురసు ముప్పు: ఒంగోలు సమీపంలో తీరం దాటనున్న తీవ్ర తుపాను.!
 మత్స్యకారులు ఆగ్నేయ, నైరుతి,  మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోకి వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ప్రస్తతం ఈ వాయుగుండం వల్ల ఏపీకి ఎటువంటి ముప్పూ లేదని పేర్కొన్న వాతావరణ శాఖ.. రానున్న రోజుల్లో ఇది ఏటు వైపు పయనిస్తుందనే అంశంపై స్పష్టత వస్తుందని తెలిపింది.

ఏపీకి ముప్పులేనప్పటికీ, శనివారం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొంది. 

మీకు నచ్చవచ్చు: మురసు తుపాను నష్టాలపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే.!

[Low pressure in Bayofbengal, Cyclone, Heavy, Rains, AP, Alert, Telugu One]

By
en-us Political News

  
సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో భాగంగా విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
గతంలో రాష్ట్రవ్యాప్తంగా మి  సంస్థలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో, వివిధ న్యాయస్థానాలలో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున ఈ 23 స్థానిక సంస్థలలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
2019 ఎన్నికల్లో కోనసీమ ప్రాంతంలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ , తాజా స్థానిక సమరంలో చతికిల పడింది.  కోనసీమ వ్యాప్తంగా అధికార  తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇందుకు వైసీపీ నేతలలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. 
ఇటీవల పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన  ధర్నాకు సంబంధించి పోలీసులు జగన్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) శుభవార్త అందించింది.
ఏపీని పెట్టుబడులకు, పారిశ్రామికాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026ను ప్రభుత్వం నిర్వహించనుంది.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అట్టడుగు వర్గాలకు అందుతున్న సేవలు, విద్యా, వైద్య రంగాలలో కల్పిస్తున్న సమాన అవకాశాల కారణంగానే ఏపీకి ఈ  ర్యాంక్ సాధ్యమైందని నిపుణులు, పరిశీలకులూ  విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న సంస్కరణల విధానం,  పాలనా దక్షత రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా నిలిచాయంటున్నారు.
హిట్ కొట్టాం అంటూ కేబినెట్ సమావేశంలో మంత్రుల నినాదాలు.!
 కడప నుంచి విజయవాడ 33 మంది ప్రయాణీకులతో వెడుతున్న   ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు    చుండి వద్దకు రాగానే బస్సు ముందు టైరు బరస్ట్ అయ్యింది. దీంతో   అప్రమత్తమైన డ్రైవర్, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు.
రెబల్స్‌ను పార్టీలో చేర్చుకోము..సీఎం కీలక వ్యాఖ్యలు.!
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడప జిల్లాలో కాంగ్రెస్‌తో హోరాహోరీగా తలపడిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠను రేకెత్తించిన గ్రామీణ స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల తుది ఘట్టం ముగిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.