సీనియర్‌ మంత్రుల్లో అంతర్మధనం

Publish Date:Aug 24, 2012

Advertisement

మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు రాజీనామాను గురించి మాట్లాడటానికెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్‌ బొత్స సత్యన్నారాయణ బుక్‌ అయ్యినట్లు తెలుస్తుంది. ధర్మాన రాజీనామాను అంగీకరించడమే కరెక్టు అని చెప్పిన అధిష్టానం పనిలో పనిగా వీరిరువురి పైనా వేటుకు సిద్దంగా ఉండటంతో బిక్కచచ్చిన మొహాల్తో వీరిద్దరూ ఉన్నారనే విషయం తెలిసింది. ధర్మాన రాజీనామాగురించి మాట్లాడుతూ ఇప్పుడు మంత్రులకు సంబంధం లేదంటే జగన్‌ తప్పించుకో వచ్చు గనుక వారిని కూడా సిబిఐ విచారణకు సిద్దపడాల్సిందే నని అధిష్టానం తేల్చింది. మంత్రులను తప్పించడం వల్ల ప్రజలమద్యకు తప్పుడు సంకేతాన్ని అందించినట్లవుతుందని అందువల్ల రాజీనామాను ఆమోదించటం సరైన మార్గంగా కేంద్రం భావిస్తుంది.

 

దీంతో రాష్ట్రంలోని మిగతా సీనియర్‌ మంత్రులు హతాషు లయ్యారు. వారంతా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరుగా జైలు జీవితం రుచి చూడవలసి వుంది. ఇప్పటికే ఈ కేసులో మంత్రి మోపిదేవి చంచల్‌గూడా జైలులో ఉన్నారు. మంత్రుల మీద చార్జిషీటు పెట్టినప్పుడే క్యాబినెట్‌కు సంబంధంలేదని చెపితే బావుండేదని, అయితే జగన్‌ కు క్విడ్‌ప్రోకో కేసుగా మాత్రమే ఉంటుందని చెప్పటం వల్ల తమంతా నమ్మినందుకు కేంద్రం తమకు నమ్మక ధ్రోహం చేసిందని మంత్రులంతా మధన పడుతునన్నారు. అయితే ఇది ఇంతటితో ఆగకుండా పిసిసి చీఫ్‌ బొత్సకు, ముఖ్యమంత్రికి కూడ చుట్టుకుంది. ఇప్పటికి అందిన వివరాల ప్రకారం సోనియా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ గంటసేపు మంతనాలు జరిపారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆజాద్‌, వాయిలార్‌రవి, అహ్మద్‌పటేల్‌ కూడా పాల్గొన్నారు. చర్చల అనంతరం ముఖ్యమంత్రి విచారవదనంతో డిల్లీలో తిరుగుతున్నారు. గురువారం నాటికే పిసిసి నుండి బొత్సకు రాంరాం అని తెలిసి పోయింది. ఈ ప్రక్షాళన ఎంతటితో ఆగుతుందో తెలియని మంత్రులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఏది ఏమైనా హస్తిన రాజకీయాలతో రాష్ట్రంలోని హస్తానికి పునాదులు పడిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.