రామాయంపట్నం రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఏపీ పారిశ్రామిక ప్రగతిలో మైలురాయి.!

Publish Date:Oct 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పారిశ్రామిక ప్రాజెక్టుకు ముందడుగు పడింది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు కేంద్రం నుంచి  అనుమతి లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల అంచనా కమిటీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు సిఫారసు చేసింది.

దీంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో ప్రధాన అడ్డంకి తొలగిపోయింది,  లక్షా మూడు వేల,408 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. రామాయపట్నం పోర్టు పరిసరాల్లో దాదాపు 5 వేల 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు ఉత్పత్రతి సామర్థ్యం ఏడాదికి  9 మిలియన్ టన్నులు.  పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌తో పాటు పెట్రోకెమికల్ ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టులో పర్యావరణ అంశాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు 30 శాతం విస్తీర్ణాన్ని గ్రీన్‌బెల్ట్‌గా అభివృద్ధి చేయనున్నారు. పర్యావరణ నిర్వహణ కోసం భారీగా నిధులు కేటాయించడంతో పాటు గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన జోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రామాయపట్నం పోర్టుతో అనుసంధానమైన మెరైన్ క్రూడ్ ఆయిల్ టెర్మినల్ కూడా ప్రాజెక్టులో భాగం కానుంది.

రామాయపట్నం పోర్టు సమీపంలో రిఫైనరీ ఏర్పాటు కావడం వల్ల ఈ ప్రాంతం భవిష్యత్తులో పెద్ద ఎనర్జీ, పెట్రోకెమికల్ హబ్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రామాయపట్నం చుట్టూ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు  బీపీసీఎల్ ప్రాజెక్టు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద సఖ్యలో  ఉపాధి అవకాశాలు   అందుబాటులోకి రానున్నాయి. నిర్మాణ దశలో వేలాది మందికి పని లభించడంతో పాటు, ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రాజెక్టు  నిర్మాణ దశలో  3 వేల 400 ఉద్యోగాలు, కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత  3 వేల 750 ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి.


మరోవైపు రామాయపట్నం రిఫైనరీతో అనుబంధ పరిశ్రమలకు  ఊతం లభించనుంది. పెట్రోకెమికల్ రంగానికి సంబంధించిన డౌన్‌స్ట్రీమ్ పరిశ్రమలు, లాజిస్టిక్స్, గిడ్డంగులు, రవాణా, సేవా రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా పోర్టు, రిఫైనరీ, అనుబంధ పరిశ్రమలు ఒకే ప్రాంతంలో ఏర్పడటం వల్ల నెల్లూరు, ప్రకాశం ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయి.

ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం,బీపీసీఎల్  ఇప్పటికే చర్యలు చేపట్టాయి. సెప్టెంబరులోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీపీసీఎల్ యాజమాన్యంతో సమావేశమై రామాయపట్నం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగంతో పాటు తయారీ, పెట్రోకెమికల్, పోర్టు ఆధారిత పరిశ్రమలకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుంది, 

మొత్తంగా చూస్తే, రామాయపట్నం రిఫైనరీకి కేంద్రం నుంచి లభించిన  గ్రీన్ సిగ్నల్ ఏపీ పారిశ్రామిక ప్రగతిలో   మైలురాయి అనడంలో సందేహం లేదు. భారీ పెట్టుబడి, వేలాది ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు, పోర్టు ఆధారిత మౌలిక వసతులతో ఈ ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలోనే ఒక ముఖ్యమైన ఇంధన కేంద్రంగా రామాయపట్నాన్ని నిలబెట్టనుంది. 

[Ramayapatnam Refinery, BPCL Refinery, , AP Mega Projects,  BPCL Petrochemical Complex, Andhra Pradesh Investments, Telugu One]

By
en-us Political News

  
నిత్యం ప్రజల మధ్య ఉండే చంద్రబాబు నాయుడు 53 రోజులు నిర్బంధంలో ఉండటాన్ని తెలుగువారు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ఎలా ఉన్నారు? అనే ఆతృతతో, ఆందోళనతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.