కూతురు ఇంట్లో ఐటీ దాడులపై సోనియాని కలిసిన చిరంజీవి
Publish Date:May 17, 2012
Advertisement
తన కూతురు సుష్మిత ఇంట్లో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ రూ.35 కోట్లకు పైగా డబ్బులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కూతురు ఇంట్లో ఐటీ దాడులపై చిరంజీవి బుధవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఆయన సోనియా గాంధీతో దాదాపు పావుగంట పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో చెన్నైలోని తన వియ్యంకుడిఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు, రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.అయితే ఆ డబ్బు దొరికింది చిరు వియ్యంకుడి ఇంట్లోనే అని సిబిఐ ప్రకటించింది.
ఆ డబ్బు అధిష్టానం చిరంజీవికి తిరుపతి ఉప ఎన్నికల ఖర్చు కోసం పంపించిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశారు. ఆ వార్తలను చిరంజీవి ఖండించారు. డబ్బులు దొరికింది తన వియ్యంకుడి ఇంట్లో కాదని, వియ్యంకుడి వియ్యంకుడి ఇంట్లో అని చెప్పారు. అయితే ఆ డబ్బు దొరికింది చిరు వియ్యంకుడి ఇంట్లోనే అని సిబిఐ ప్రకటించింది.
http://www.teluguone.com/news/content/chiranjeevi-sonia-24-14092.html





