రాజకీయ నాయకులను హడలెత్తిస్తున్న సిబీఐ

Publish Date:May 17, 2012

Advertisement

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సిబీఐ తొలిగా 1948లో జీపుల కొనుగోలు సందర్భంగా 80లక్షల రూపాయల మేరకు కుంభకోణం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సిబీఐ కేసు నమోదు చేసింది. ఆ నాటి నుంచి ఉత్తరప్రదేశ్ లో జరిగిన టాయిలెట్స్, బీహార్ లో జరిగిన గడ్డి కుంభకోణం వరకు మేరకు అనేక కేసులు నమోదు చేసింది. ఆనాటి నుంచి 1990 వరకు ఏడాదికి ఒకటి రెండు కేసులు నమోదు చేసినా 1990 తరువాత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.

 

 

2010వ సంవత్సరంలో 17 కేసులు, 2011లో 25కేసులు, 2012లో 37కేసులను సిబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో 10కోట్ల రూపాయల విలువైన్ బొగ్గుగనుల వేలంనాకు సంబంధించిన కుంభకోణం మొదలుకొని లక్షా 75కోట్ల రూపాయలకు చెందిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం, ఇస్రోస్కామ్, హర్యానా ఫారెస్ట్ స్కామ్. మహారాష్ట్ర స్టాంప్స్ స్కామ్ వంటి అనేక కాసులు వున్నాయి. సిబీఐ దర్యాప్తు కొనసాగిస్తున్న లేదా దర్యాప్తు పూర్తిచేసిన కేసులలో పార్లమెంటు సభ్యుడి నుంచి ప్రధానమంత్రి వరకు నిందుతులుగా ఉన్నారు. వి.పి.సింగ్ ప్రధానమంత్రిగా వుండగా వి.పి.సింగ్ ను అవినీతి పరునిగా చూపడం కోసం లకుభాయ్ పాథక్ తో కలిసి కుట్రచేసినట్టు వచ్చిన ఆరోపణపై సిబీఐ దర్యాప్తు చేసి దివంగత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై కేసు నమోదు చేసింది.

ఈ కేసులో కింది కోర్టులో పి.వి.నరసింహారావుపై నేరం రుజువు కావడంతో పాటు శిక్ష కూడా పడింది. ఆ తర్వాత హైకోర్టులో కేసును కొట్టివేయడం ఈలోగా పి.వి. నరసింహారావు చనిపోవడం జరిగింది. పంజాబ్ లో వ్యవసాయశాఖా మంత్రి తోట సింగ్ అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సిబీఐ కేసు నమోదు చేయగా మంత్రికి కోర్టులో ఏడాది జైలు శిక్షపడింది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన శిబుసోరెన్ పై కూడా నేరం రుజువు కావడం శిక్షపడింది. తాజాగా సిబీఐ కోర్టు తెహల్కా స్ట్రింగ్ ఆపరేషన్ లో విలేఖరుల నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన బిజెపి జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ కు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది.

 

 

కేసుల చరిత్ర పరిశీలిస్తే వివిధ కేసులలో నిందితులుగా వున్న ముఖ్యమంత్రులైనా, పార్లమెంటు సభ్యులైనా, కేంద్రమంత్రులైనా ఎవరినీ అరెస్టు చేయకుండా వదిలిపెట్టిన దాఖలా కనిపించడం లేదు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్. జగన్మోహన రెడ్డితో పాటు పంజాబు ముఖ్యమంత్రులుగా చేసిన ప్రతాప్ సింగ్ బాదల్, ప్రకాష్ సింగ్ ఖైరాన్ లను అక్రమ ఆస్తుల కేసు విషయంలో అరెస్టు చేసి జైలులో పెట్టింది. అక్రమ ఆస్తులు, ఛీటింగ్, జర్నలిస్టుపై దాడి అంశాలపై పంజాబు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖబీర్ సింగ్ బాదల్ ను అరెస్టు చేసింది.

 

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ను ఆదర్శ హౌసింగ్ కాలనీ అక్రమాలపై సిబీఐ దర్యాప్తు చేస్తోంది. హవాలా డబ్బు విషయమై కేంద్రమంత్రి బలరాం జక్కర్ పై, ఏసియన్ గేమ్స్ నిర్వహణలో అక్రమాలపై ఎంపి సురేష్ కల్మాడీ, 2జి స్పెక్ట్రమ్ కేసు విషయంలో కలిమోలి, కేంద్రమంత్రి రాజా, కేంద్ర టెలికమ్యూని కేషన్ మంత్రి సుఖ్ రామ్, 40వేల కోట్ల విలువైన గ్రాఫ్ట్ మని కుంభకోణంపై జార్ఖండ్ మధుకోడాను, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మైనింగ్ అక్రమాల విషయంలో కర్ణాటక మంత్రి గాలి జనార్థన రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి విదర్భసింగ్, గడ్డి కుంభకోణం విషయంలో బీహార్ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ లపై సిబీఐ కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది.

By
en-us Political News

  
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.