హైదరాబాద్ ఐ.ట్. ఉద్యోగులకు దుర్వార్త!
Publish Date:May 14, 2012
Advertisement
రాష్ట్రంలో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీరంగం పురోగతి బాగా మందగించింది. ఇప్పటికే రంగంలో ఉన్న కంపెనీలు తమ లక్ష్యాలను అందుకోలేక సతమతమవుతున్నాయి. కొత్త కంపెనీలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ రంగంపై రాష్ట్రంలో ప్రత్యక్షంగా మూడు లక్షలమంది పరోక్షంగా పదిలక్షల మంది ఆధారపడి ఉన్నారు. మన రాష్ట్రంలోని ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 1500 చిన్న, పెద్ద ఐటీ కంపెనీలున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఇవి ప్రధానంగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఉప్పల్, పోచారం, శామీర్ పేట్, శంషాబాద్ లో కొత్త ఐటీ కంపెనీల ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. మహేశ్వరం, ఉప్పల్ కేంద్ర సహకారంతో రెండు గ్రీన్ ఫీల్డ్ ఐటీ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విశాఖ, తిరుపతి, వరంగల్ లో కూడా ఐటీ టూటైర్ ఫీల్డ్ గా తీర్చిదిద్దాలన్న ప్రయత్నాలకు స్పందన కరువైంది. 1998లో 250కోట్ల రూపాయల విలువ చేసే ఐటీ ఉత్పత్తులతో ప్రారంభమైన రాష్ట్ర ఐటీ ప్రస్తానం చంద్రబాబునాయుడు, డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో తారాస్థాయికి చేరుకుంది. వై.ఎస్. మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఐటీ రంగం బాగా దెబ్బతింది. 2010-11లో ఐటీ ఉత్పత్తుల దిగుమతుల విలువ 36వేల కోట్ల రూపాయలు. 2011-12లో 40వేల కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ లక్ష్యాన్ని ఛేదించలేని వాతావరణం ప్రస్తుతం కనిపించటం లేదు. దీంతో ఆయా కంపెనీలు ఐటీ ఉద్యోగుల కొత్త రిక్రూట్ మెంట్ లను తగ్గించేయడంతో పాటు ఉన్నవారికి క్రమంగా ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ పరిణామాలు ఐటీ ఉద్యోగుఅలకు నిజంగా దుర్వార్తే.
http://www.teluguone.com/news/content/bad-news-to-hyderabad-it-employees-24-14013.html





