వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో ఆలరించిన మంత్రి కందుల

Publish Date:Mar 6, 2026

Advertisement

 

 

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశత్వాన్ని ఎదిరించి, భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో విప్లవ జ్యోతిగా వెలిగిన వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అద్భుత నటనతో అలరించారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం, శుక్రవారం సాయంత్రం విజయవాడ పట్టణం పటమటలోని ఆంత్రలాక్స్ హాల్‌లో ప్రజాప్రతినిధుల కోసం  ఆంధ్రప్రదేశ్ “శాసన వ్యవస్థ” ఆధ్వర్యంలో నిర్వహించిన "ఆటవిడుపు"ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు – 2026 కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ తనదైన శైలిలో ఈ ప్రదర్శన ఇచ్చారు. 

 

 

సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యకామాలను ప్రారంభించారు. కట్టబొమ్మన విశిష్ట ఆహార్యం, గంభీరమైన వాచకం, రాజసంతో మంత్రి దుర్గేష్ ఆ పాత్రలో జీవించేశారు. ఆయన వేదికపైకి రాగానే సభలో చప్పట్ల వర్షం కురిసింది.ఈ ప్రదర్శనను వీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు మంత్రి దుర్గేష్ నటనను వేనోళ్ల కొనియాడారు. 

 

 

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. "దేశభక్తికి నిలువెత్తు రూపం వీరపాండ్య కట్టబొమ్మన అని, పాంచాలకురిచ్చి యుద్ధంలో ఆయన చూపిన సాహసం చిరస్మరణీయమని" కొనియాడారు. అటువంటి మహనీయుడి పాత్రను పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ నటనా శైలి, సంభాషణల చాతుర్యం, పుణ్యభూమి నాదేశం నమోనమామి పాటలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, సునీల్ కుమార్ తదితర సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రదర్శించిన తీరు సభికులను మంత్రముగ్ధులను చేసింది.

 

By
en-us Political News

  
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.