మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో జరుగుతున్న పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా టన్నెల్-2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన టీబీఎం యంత్రాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. టన్నెల్‌లో జరుగుతున్న బెంచింగ్, లైనింగ్ పనులు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో మంత్రి క్షేత్రస్థాయిలో తనిఖీ చేపట్టారు.
పనులు జరుగుతున్న నాలుగు గ్యాంట్రీల వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. లక్ష్యానికి అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.రాత్రంతా టన్నెల్‌లోనే ఉండి పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించిన మంత్రి, 24 గంటలపాటు క్లాక్‌వైజ్ విధానంలో పనులు కొనసాగాలని సూచించారు.
టన్నెల్‌లో పనిచేస్తున్న గ్యాంట్రీలు, కార్మికులు, యంత్రాల మధ్య సమన్వయం పెంచి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.సుమారు 19 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్స్‌లో క్లిష్టమైన, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికులు, అధికారులకు మంత్రి స్వయంగా రాత్రివేళల్లో అక్కడే ఉండి ప్రోత్సాహం కల్పించడం విశేషం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యర్రగొండపాలెం నియోజకవర్గ బాధ్యుడు గూడూరి ఎరిక్షన్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-ramanaidu-inspected-the-works-throughout-the-night-36-219058.html
ఈ లీగల్ బ్యాటిల్‌లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు.
వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 7వేల పోస్టులలో ఇప్పటికే 5వేల పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను జారీ చేసింది. మిగిలిన 2వేల పోస్టులకు సంబంధించిన జీవోలు కూడా నేడో రేపో వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం.
బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ బ్యాంకు రుణాలకు గ్యారెంటీగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్‌లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని వారు తాకట్టు పెట్టారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధారణ ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ బ్యాటర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ దిగ్గజాల విమర్శించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.