ప్రత్యక్ష పద్ధతిలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక.. సవరణ చట్టాలకు గవర్నర్ ఆమోదముద్ర.!

Publish Date:Aug 29, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలోనూ, స్థానిక పరిపాలనా వ్యవస్థలోనూ   కీలక  మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు.   రాష్ట్రంలో పురపాలక, పంచాయతీ రాజ్ చట్టాల్లో సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లులపై గౌరవ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ సంతకం చేశారు. గవర్నర్ ఆమోదముద్ర పడటంతో ఈ నూతన సంస్కరణలు  అమలులోకి వచ్చాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా నూతన విధానంలో నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.

గవర్నర్ ఆమోదం పొందిన మున్సిపల్ చట్ట సవరణ ప్రకారం.. ఇకపై రాష్ట్రంలోని కార్పొరేషన్ మేయర్లు, పురపాలక సంఘాల ఛైర్‌పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకోనున్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న పరోక్ష ఎన్నికల విధానానికి స్వస్తి పలుకుతూ, వార్డు కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లతో సంబంధం లేకుండా ఓటర్లే స్వయంగా తమ పురపాలక నాయకుడిని ఎన్నుకునేలా ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని పునరుద్ధరించారు. ఈ నిర్ణయంతో స్థానిక సంస్థలలో నాయకత్వ ఎన్నిక ప్రక్రియ  పారదర్శకంగా మారడమే కాకుండా, రాజకీయ వ్యూహాలు, క్యాంప్ రాజకీయాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.

మరోవైపు పంచాయతీ రాజ్ చట్టంలో కూడా ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో గతంలో ఉన్న రెండు డిప్యూటీ మేయర్, రెండు వైస్ ఛైర్‌పర్సన్ పదవుల సంఖ్యను ఒక్కదానికి కుదించారు. పాలనా వ్యయాన్ని తగ్గించడంతో పాటు పదవుల కేటాయింపులో స్పష్టత తీసుకురావడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు. దీనితో పాటు రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల సంఖ్యను పెంచేందుకు చట్టసవరణ చేశారు. గతంలో 13గా ఉన్న జిల్లా పరిషత్‌లను ఇప్పుడు 28 జెడ్పీలుగా విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జిల్లాల సంఖ్య పెరిగినప్పటికీ జిల్లా పరిషత్ బోర్డుల విభజన సరిగ్గా జరగకపోవడం వల్ల ఎదురవుతున్న పాలనాపరమైన ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా  28 జెడ్పీల ఏర్పాటు నిర్ణయం సాగింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు వేర్వేరుగా జిల్లా పరిషత్‌లు ప్రాతినిధ్యం వహించడం వల్ల  గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నిక కూడా ప్రత్యక్ష పద్ధతిలోనే జరిగేలా కొత్త చట్టంలో స్పష్టమైన నిబంధనలను పొందుపరిచారు.

 

{AP Local Body Elections, Governor Abdul Nazeer Municipal Act Amendment, Direct Mayor Elections AP, AP Panchayat Raj Act Amendment, 28 Zilla Parishads Andhra Pradesh}

By
en-us Political News

  
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.