53 రోజుల నిర్బంధం.. కోట్లాది హృదయాల స్పందన మరువలేను: సీఎం చంద్రబాబు. !

Publish Date:Oct 31, 2026

Advertisement

మూడేళ్ల క్రితం ఇదే రోజు రాజమండ్రి జైలు నుంచి విడుదల.!

53 రోజుల నిర్బంధ సమయంలో తనకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును జీవితాంతం మర్చిపోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మూడేళ్ల క్రితం ఇదే రోజున రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగ ట్వీట్‌ చేశారు. నాడు తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

53 రోజుల నిర్బంధం.. జీవితంలో మరిచిపోలేని ఘట్టం.!

తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులు అత్యంత కఠినమైనవని చంద్రబాబు పేర్కొన్నారు. అప్పటి పాలకులు తనను నంద్యాలలో అర్ధరాత్రి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారని, అది కుట్రపూరిత అరెస్టు అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. న్యాయస్థానం తీర్పుతో జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రజల్లోకి వచ్చిన రోజును గుర్తుచేసుకున్నారు. తనను నిర్బంధించి ఒంటరిని చేయాలనుకున్న ప్రయత్నాలు ప్రజల సంఘీభావంతో విఫలమయ్యాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాడు తనకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల స్పందనను ఎప్పటికీ మర్చిపోలేనని స్పష్టం చేశారు.

గచ్చిబౌలి స్టేడియంలో మద్దతు మరువలేనిది.!

తనకు సంఘీభావం తెలిపేందుకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 'సీబీఎన్ గ్రాటిట్యూడ్‌' కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, వృత్తి నిపుణుల మద్దతు జీవితాంతం గుర్తుంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. తాను ప్రవేశపెట్టిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందినవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకు మద్దతుగా నిలవడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా, ప్రపంచంలోని 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు సంఘీభావం తెలిపారని ట్వీట్‌లో గుర్తుచేసుకున్నారు.

ప్రతి వర్గం నుంచి సంఘీభావం.!

రైతుల నుంచి సాఫ్ట్‌వేర్‌ నిపుణుల వరకు, విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు, సామాన్య మహిళల నుంచి కార్పొరేట్‌ సంస్థల ఉన్నతాధికారుల వరకు వివిధ వర్గాల ప్రజలు తనకు మద్దతుగా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే తన సతీమణి, కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వచ్చారని గుర్తుచేసుకున్నారు. వారికి అండగా నిలిచిన ప్రజలు నిజాన్ని గెలిపించారని, ధర్మాన్ని నిలబెట్టారని వ్యాఖ్యానించారు.

మీ నమ్మకమే నా బలం.. మీ భవిష్యత్తే నా సంకల్పం.!

తనకు మద్దతు తెలిపిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానులకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం ప్రకటించిన వారందరికీ చంద్రబాబు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. తన కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన ప్రేమ, అభిమానం, నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. తన కోసం నిలిచిన ప్రజల కోసం చివరి వరకు నిలబడతానని స్పష్టం చేశారు. 'మీ నమ్మకం, అభిమానం నా బలం.. మీ భవిష్యత్తు నా సంకల్పం' అని పేర్కొన్న చంద్రబాబు.. ప్రజల మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నంబర్‌ వన్‌గా నిలబెడతానని పునరుద్ఘాటించారు.

 

 

 

[ 53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics ]

By
en-us Political News

  
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.