యలహంక ప్యాలెస్ నా ఆస్తి: షర్మిల సంచలన ప్రకటన.!
Publish Date:Oct 31, 2026
Advertisement
వైఎస్ కుటుంబంలో రోజురోజుకూ ముదురుతున్న ఆస్తుల పంపిణీ రగడ ఇప్పుడు పీక్స్ కు చేరింది. . బెంగళూరులోని యలహంక ప్యాలెస్ యాజమాన్య హక్కులకు సంబంధించి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన కుమార్తె అంజలి వివాహ వేడుకను యలహంకలో ఉన్న ప్యాలెస్‌లోనే నిర్వహించాలని షర్మిల భావించారు. అయితే, సెక్యూరిటీ నిబంధనలు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు. యలహంక ప్యాలెస్ వంద శాతం తన అస్తి అని షర్మిల నెట్టింట షేర్ చేసిన పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకాలం యలహంక నివాసం పూర్తిగా జగన్‌కే చెందుతుందసామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు సాగాయి. అయితే ఈ ప్రచారాలన్నింటికీ తెరదించుతూ, ఆ యలహంక ప్యాలెస్ 100 శాతం తనకే చెందుతుందని షర్మిల కుండబద్దలు కొట్టారు. కుటుంబ ఆస్తుల పంపిణీ సమయంలోనే ఈ భవనం తన హక్కుల పరిధిలోకి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఆస్తి పంపిణీ నిబంధనల ప్రకారం ఆ భవనంలో ఏం జరగాలనేది నిర్ణయించే హక్కు జగన్‌కు ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. అయితే శుభకార్యం వేళ వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే తన కుమార్తె వివాహ వేదికను యలహంక నుంచి మారుస్తున్నట్లు పేర్కొన్నారు. కుమార్తె పెళ్లి ఏ ఒక్కరి మధ్య మనస్పర్థలకు కారణం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బంధువులు, అత్యంత ఆప్తుల సమక్షంలో వేరే ప్రాంతంలో వివాహ వేడుకను ఘనంగా పూర్తి చేస్తానని షర్మిల స్పష్టం చేశారు. ఈ వివాదం పెద్దది కాకూడదనే ఆలోచనతో ఆమె వేదిక మార్పునకు అంగీకరించినప్పటికీ, యలహంక ఆస్తి హక్కులపై ఆమె చేసిన ప్రకటన వైఎస్ కుటుంబ అంతర్గత వివాదాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నా చెల్లెళ్ల మధ్య ఇప్పటికే ఆస్తులకు సంబంధించి న్యాయపోరాటాలు, మాటల యుద్ధాలు నడుస్తున్న తరుణంలో ఇప్పుడు యలహంక ప్యాలెస్ ఆస్తి పూర్తిగా తనదేనంటూ షర్మిల చేసిన ప్రకటన కుటుంబ తగాదాలు పీక్స్ వెల్లాయన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. వివాహ వేడుక ముగిసిన తర్వాత యలహంక ఆస్తి హక్కులపై ఇరుపక్షాల మధ్యా మాటల యుద్ధమే కాక న్యాయపోరాటం కూడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Yelahanka Palace Sharmila, Property, Jagan Property Dispute, Sharmila Daughter Wedding Venue, Bengaluru Yelahanka house Ownership, Telugu One]
http://www.teluguone.com/news/content/yelahanka-palace-sharmila-43-235912.html




