అభివృద్ధి ప్రమాణాల ఐకానిక్ నగరం అమరావతి.!

Publish Date:Aug 29, 2026

Advertisement

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమౌతోంది.  ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పర్యావరణ అనుకూల విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ ఆధునిక మహానగరం నిర్మాణ పురోగతి   గ్లోబల్ ఇన్వెస్టర్లు,  పారిశ్రామిక దిగ్గజాలు అసక్తిని చూరగొంటోంది. నవ్యాంధ్రకు మకుటాయమానంగా భావిస్తున్న అమరావతిని కేవలం  పాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, సమగ్ర పట్టణ అభివృద్ధి ప్రమాణాలకు నమూనాగా రూపుదిద్దుకుంటున్నది.  అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక, వ్యాపార, సాంకేతిక శక్తులను ఆకర్షిస్తూ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో అమరావతి  ప్రత్యేకతను చాటుకుంటోంది.

ప్రపంచంలోని ఆధునిక స్మార్ట్ సిటీలకు దీటుగా అమరావతి నగర ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి సంస్థలు, వివిధ దేశాలకు చెందిన మౌలిక వసతుల నిపుణులు అమరావతి నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములవుతున్నారు. రాజధాని ప్రాంతంలో రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరా, తాగునీటి యాజమాన్యం వ్యర్థాల నిర్వహణ వంటి కీలకమైన ప్రాథమిక సదుపాయాలను అత్యంత పారదర్శకమైన సాంకేతికతతో డిజైన్ చేస్తున్నారు. గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, పర్యావరణహిత హరిత రవాణా విధానాలు,  అత్యాధునిక డిజిటల్ నెట్‌వర్కింగ్ ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన లండన్, సింగపూర్ వంటి మహానగరాల పట్టణ డిజైనింగ్ నమూనాలను అధ్యయనం చేస్తూ, స్థానిక అవసరాలకు అనుగుణంగా అమలు చేస్తున్నారు.

ఈ  ప్రాజెక్టు వైపు గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్స్ కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ , ప్రపంచ బ్యాంక్  వంటి  అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అమరావతి మౌలిక వసతుల పనులకు పెద్దపీట వేస్తూ రుణాలు, ఆర్థిక చేయూతను అందించేందుకు ముందుకు వచ్చాయి. మౌలిక సదుపాయాల కల్పనలో చూపించే పారదర్శకత,  సుస్థిర ప్రగతి లక్ష్యాలు  గ్లోబల్ స్థాయిలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంపొందించాయి. విదేశీ ప్రభుత్వాలు, బహుళజాతి కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేక ఆసక్తిని కనబరచడానికి అంతర్జాతీయ ప్రమాణాలే   కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆధునిక మౌలిక వసతులతో పాటు అమరావతిని ఒక ఆర్థిక శక్తికేంద్రంగా తీర్చిదిద్దేందుకు బహుముఖ ప్రణాళికలు అమలవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, క్రియేటివ్ ఎకానమీ స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ రంగాలు ఇక్కడ ప్రాధాన్యం పొందుతున్నాయి. విదేశీ సంస్థల భాగస్వామ్యంతో సరికొత్త టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ వేగవంతమైంది. గ్లోబల్ కనెక్టివిటీకి అనుగుణంగా నిర్మిస్తున్న విశాలమైన రహదారులు, అంతర్గత మెట్రో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కార్రిడార్లు అమరావతి ప్రతిష్టను ఇనుమడింప చేస్తున్నాయి.  . ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు  తీసుకుంటున్న చర్యలు ప్రపంచ సంస్థలను  ఆకర్షిస్తున్నాయి.

పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ సాగే శరవేగమైన పట్టణాభివృద్ధే అమరావతి ప్రత్యేకత. సాధారణంగా నగరాలు వేగంగా విస్తరించే క్రమంలో పర్యావరణ కాలుష్యం, జల వనరుల కొరత వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే.. అమరావతి ఇందుకు భిన్నం.  అమరావతి మాస్టర్ ప్లాన్‌లో కృష్ణానదీ తీరాన్ని కేంద్రంగా చేసుకుని రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ను పర్యావరణ హితంగా తీర్చిదిద్దుతున్నారు. విశాలమైన పార్కులు, సహజసిద్ధమైన కాలువల పరిరక్షణ, సౌర విద్యుత్ వినియోగం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇదొక క్లైమేట్-రెసిలెంట్  నగరంగా రూపుదిద్దుకుంటోంది. ఈ పర్యావరణ అనుకూల పట్టణ నమూనా అంతర్జాతీయ పర్యావరణ వేదికలపై  విశేష ప్రశంసలు అందుకుంటోంది.

రాజధాని ప్రాంతంలో చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ విధానం కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. స్థానిక రైతులతో భాగస్వామ్యమై బృహత్తర నగరాన్ని నిర్మించడం అనేది ప్రపంచ పట్టణాభివృద్ధి చరిత్రలోనే ఒక వినూత్న అధ్యాయంగా నిలిచింది. ప్రజా భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించే ఈ మోడల్ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇక్కడ సిద్ధమవుతున్న వాణిజ్య, నివాస,  పారిశ్రామిక జోన్లు రాబోయే రోజుల్లో మిలియన్ల సంఖ్యలో ఉపాధి అవకాశాలను సృష్టించనున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, హాస్పిటాలిటీ,  ఎడ్యుకేషన్ రంగాలలో గ్లోబల్ బ్రాండ్లు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనువైన వాతావరణం సిద్ధమవుతోంది.

రాబోయే కాలంలో అమరావతి కేవలం ఒక రాష్ట్ర రాజధానిగానే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్య సమూహాలకు ప్రధాన కేంద్రంగా మారుతుందనీ,  అంతర్జాతీయ పెట్టుబడులు ముమ్మరంగా తరలిరావడంతో ఈ ప్రాంతంలో మౌలిక పారిశ్రామిక పురోగతి గణనీయంగా పుంజుకుంటుందనీ చెబుతున్నారు.  విదేశీ సాంకేతికత, దేశీయ వనరుల కలయికతో అమరావతి   వేగం ప్రపంచ వేదికపై సరికొత్త పట్టణాభివృద్ధి ప్రమాణాలను నెలకొల్పుతుందనడంలో సందేహం లేదు.


{Amaravati Global Investments, AP Capital Urban Development, Amaravati Infrastructure Projects, Andhra Pradesh Green Smart City, AP Investments, Telugu One}
 

By
en-us Political News

  
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.