ఒమేగా హాస్పటల్స్ పై ఐటీ దాడులు: ఐదు రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
Publish Date:Oct 30, 2026
Advertisement
ట్యాక్స్ ఎవేషన్ , భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయనే పక్కా సమాచారం, నిర్దుష్ట ఆరోపణలతో ఐటీ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ క్యాన్సర్ కేర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందిన ఒమేగా హాస్పిటల్స్ పై మెరుపు దాడులు నిర్వహించింది. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ఎనిమిది ప్రత్యేక బృందాలు.. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, గచ్చిబౌలి ప్రధాన ఆసుపత్రుల శాఖలతో పాటు కీలక వైద్యులు, డైరెక్టర్లు, సీఈవోల నివాసాలు, కార్యాలయాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోదాలు జరుగుతున్న ఆవరణల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తనిఖీలు కొనసాగుతున్న తరుణంలో అధికారులు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ డేటా రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. [IT Raida On Omega Hospitals, Income Tax, Five States, 24Places, Telugu One]
http://www.teluguone.com/news/content/it-raida-on-omega-hospitals-36-235865.html




