AI వల్ల మరో ప్రాణం గాల్లోకి.. వైద్యుల హెచ్చరికలను కాదని చాట్‌జీపీటీని నమ్మి మహిళ మృతి!

Publish Date:Nov 5, 2026

Advertisement

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) రోజురోజుకూ మానవ జీవితంలో ఒక భాగమైపోతున్న తరుణంలో, టెక్నాలజీ అతిగా నమ్మితే జరిగే ప్రాణాంతక ముప్పునకు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని సియాటెల్‌లో జరిగిన ఈ విషాదకర ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన 31 ఏళ్ల బోవెన్ వాన్ అనే యువతి మూర్ఛ (Epilepsy) వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ మరణానికి ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా కృత్రిమ మేధ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ (ChatGPT) ఇచ్చిన సలహాలను గుడ్డిగా నమ్మడమే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థపై కోర్టులో కేసు వేశారు.

చైనాకు చెందిన బోవెన్ వాన్ ఉపాధి నిమిత్తం అమెరికాకు వెళ్లగా, తీవ్రమైన మూర్ఛ వ్యాధి లక్షణాల కారణంగా ఆమె గతంలోనే ఉద్యోగానికి కొంత విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో  లామోట్రిజిన్  (Lamotrigine) అనే మందును వాడుతూ నియంత్రణ సాధించింది. అయితే, తాను వాడుతున్న ఈ మందుల వల్ల ఆలోచనా శక్తి నెమ్మదించడం, మాటలు తడబడటం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆమె తీవ్ర ఆందోళన చెందింది. ఇదే సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో, అమెరికాలో ఉండాలంటే త్వరగా మరో ఉద్యోగం సంపాదించాలనే తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ భయాలతోనే ఆమె వైద్యులను సంప్రదించకుండా, నేరుగా చాట్‌జీపీటీని ఆశ్రయించింది.

తన అనారోగ్య సమస్యలు, మందుల మోతాదు గురించి బోవెన్ వాన్ చాట్‌జీపీటీని ఏకంగా 158 సార్లు సంప్రదించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రోజువారీ వాడే 400 మి.గ్రా. మందుల మోతాదును పూర్తిగా సున్నాకు తగ్గించుకునేందుకు చాట్‌జీపీటీ ఆమెకు కేవలం 25 రోజుల ప్రణాళికను రూపొందించి ఇచ్చినట్లు దావాలో పేర్కొన్నారు. ఈ ప్రమాదకరమైన తగ్గింపు సమయంలో ఆమె తీవ్రమైన గందరగోళం, మైకం వంటి లక్షణాలను ఎదుర్కొన్నప్పటికీ, చాట్‌జీపీటీ మాత్రం మెదడు సహజ స్థితికి వస్తోందంటూ తప్పుడు భరోసా ఇచ్చింది. చివరి రోజుల్లో తన మెదడు పూర్తిగా అలసిపోయిందని, మళ్లీ మందులు వాడాలా అని ఆమె ఆందోళనతో ప్రశ్నించినా, చాట్‌బాట్ మాత్రం మోతాదును సున్నా వద్దే కొనసాగించమని సూచించింది.

చివరికి 2026 ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి ఆమె చివరి సందేశం పంపిన తర్వాత ఎటువంటి స్పందన లేకపోవడంతో, అనుమానం వచ్చిన తండ్రి స్నేహితుల సహాయంతో అపార్ట్‌మెంట్‌ను పరిశీలించగా బోవెన్ విగతజీవిగా పడిఉంది. వైద్య పరీక్షల్లో ఆమె మరణానికి మూర్ఛ వ్యాధితో సంబంధం ఉన్న ఆకస్మిక మరణం (SUDEP - Sudden Unexpected Death in Epilepsy) కారణమని తేలింది. మందులను ఏమాత్రం ఆపకూడదని వైద్యులు స్పష్టం చేస్తుండగా, ఏఐ చాట్‌బాట్ మాత్రం వైద్య సలహాలను ధిక్కరించేలా వ్యవహరించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతపై, వైద్యపరమైన నిర్ణయాల్లో ఏఐని గుడ్డిగా నమ్మడంపై తీవ్రమైన చర్చకు దారితీసింది.

 

 

ChatGPT Medical Advice Danger, AI Healthcare Risks, Woman Dies Trusting Chatbot, Artificial Intelligence Safety Warning, Doctor Vs AI Diagnosis, Tech News In Telugu, Health Awareness Articles.

By
en-us Political News

  
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారిరువురూ బేగంపేటలో  ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం (నవంబర్ 2)న కలిశారు.  ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న  సైబర్ సవాళ్ల ను వివరించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ద్వారా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా, అనుచిత రీతిలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి అమిత్ షాకు తెలిపారు.
భారతదేశానికి జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? పూజల సంకల్పంలో జంబుద్వీపం అని ఎందుకు అంటారు? పురాణాలు మరియు చరిత్ర తెలిపే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.