విపత్తులపై ప్రకృతి ముందస్తు హెచ్చరికలు.. గమనించి అప్రమత్తం అవ్వడం మనిషి బాధ్యత.!

Publish Date:Oct 30, 2026

Advertisement

వైపరీత్యాలకు సంబధించిన హెచ్చరికలను ప్రకృతి ముందుగానే తెలియజేస్తుంది. ఔను ప్రకృతి మనవుడితో సంభాషిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేస్తూనే ఉంటుంది. అయితే మనిషి మేధ ఆ హెచ్చరికలను అర్ధం చేసుకునే నేర్పు సంతరించుకోవాల్సి ఉంది. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.   జీవన పోరాటంలో భాగంగా అవి ప్రదర్శించే విచిత్రమైన ప్రవర్తనా మార్పులు   ప్రమాదాలకు హెచ్చరికలుగా మన పూర్వీకులు గుర్తించగలిగే వారు.  

వాతావరణంలో తలెత్తే మార్పులు, ముఖ్యంగా కరవు పరిస్థితులు,  ఎల్-నినో ప్రభావం వంటి అంశాలను కొన్ని వృక్షాలు చాలా చాలా ముందుగానే అంచనా వేస్తాయని పరిశోధనలు తేల్చాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే.. నేరేడు చెట్లు భూగర్భ జలాల మట్టాన్ని పసిగట్టగలుగుతాయి. వీటి వేర్లు భూమిలోకి అసాధారణ లోతు వరకు చొచ్చుకుపోతాయి కాబట్టి, భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో ఈ చెట్లకు ప్రమాద సంకేతాలు అందుతాయి. వెంటనే అవి సాధారణ వృద్ధిని నిలిపివేసి, తమలోని పూర్తి శక్తిని కాయలు కాయడానికి కేటాయిస్తాయి.  ఫిబ్రవరి లేదా మార్చి మాసాల్లోనే చెట్టు నిండా నేరేడు కాయలు కాయలు కనిపిపించి, వాటి సైజు చిన్నగా ఉంటే ఆ ఏడాది తీవ్ర వర్షాభావం పరిస్థితులు ఏర్పడతాయనీ, కరవు ముప్పు పొంచి ఉందనీ సంకేతంగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.   దీన్ని వృక్షశాస్త్రంలో  స్ట్రెస్ ఫ్రూటింగ్ అంటారు. మీరు గమనించి ఉంటే ఈ ఏడాది మార్చి నెల కంటే ముందే మార్కెట్లోకి నేరేడు పండ్లు తామరతంపరగా వచ్చి పడ్డాయి. ఏటా వచ్చే సీజన్ కంటే ముందుగానే నేరేడు కాపు విరగకాయడం, అలాగే వాటి సైజు చిన్నగా ఉండటం గమనించే ఉంటారు. అంటే వేసవి కంటే ముందే నేరేడు వృక్షాలు రానున్న వర్షాభావ పరిస్థితిని ఎలుగెత్తి చాటాయి.  

ఇక చింత,  వేప చెట్లు కూడా  కరువు పరిస్థితులను ముందుగానే సంకేతాల రూపంలో వెల్లడిస్తాయి. సాధారణంగా ఉగాది పర్వదినం తర్వాత కొత్త చిగుళ్లు తొడిగే చింత   చెట్లు కరువు రాబోయే సంవత్సరంలో ఉగాది కంటే ముందే లేత ఆకులు, పూతతో ముందస్తు సంకేతాలు ఇస్తాయి. భూగర్భంలో నీటి మట్టాలు భారీగా పడిపోయినప్పుడు చెట్టు తన చివరి ప్రయత్నంగా విత్తనోత్పత్తిని   పెంచేస్తుంది. అలాగే వేప చెట్లు డిసెంబర్, జనవరి మాసాల్లోనే భారీగా పూత పూసినప్పటికీ, ఆ గింజల్లో నూనె శాతం గణనీయంగా తగ్గిపోతుంది. నీటి కొరతను తట్టుకునేందుకు చెట్టు నూనె తయారీని నిలిపివేసి తేమను ఆదా చేసుకుంటుంది. తుమ్మ చెట్లు సైతం నీటి ఎద్దడి తీవ్రమైనప్పుడు ఆకులన్నింటినీ రాల్చేసి, కేవలం ముళ్లతో మిగిలిపోతుంది. అయినా తుమ్మ కాయలు విపరీతంగా కాస్తాయి.  ఇలాంటి మార్పులతో చెట్లు ముందస్తుగానే వర్షభావ పరిస్థితులకు సంబంధించిన సంకేతాలు ఇస్తాయి. వాటిని గమనించి, తదనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనిషిదే. 


అదే విధంగా అతివృష్టి, వరదలు,  తుపానుల రాకను కూడా ప్రకృతి ముందస్తుగానే హెచ్చరిస్తుందని పర్యవరణ వేత్తలు చెబుతున్నారు.   ఉదాహరణకు మర్రి చెట్లు వరద ముప్పుకు ముందు తమ ఊడల వ్యవస్థను వేగంగా విస్తరిస్తాయి. గాలిలో తేమ శాతం విపరీతంగా పెరగడం, భూమిలో నీటి నిల్వలు హెచ్చిన సందర్భంలో ఆ అదనపు తేమను గ్రహించేందుకు ఊడలు వేగంగా నేలలోకి చొచ్చుకుపోతాయి. ఇక కొబ్బరి చెట్లు భారీ వర్షాలు కురిసే ముందు తమ ఆకుల రంగును ముదురు ఆకుపచ్చగా మార్చుకుంటాయి. కాయలు కూడా పెద్దవిగా, నీటితో నిండిపోతాయి. ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు చెట్లు సామూహికంగా పూత పూయడం   ఒక పెద్ద విపత్తుకు సంకేతంగా భావిస్తారు. సాధారణంగా దశాబ్దాల పాటు పూయని వెదురు అకస్మాత్తుగా ఒకే సమయంలో పూసి నశించిపోతే, ఆ ప్రాంతంలో ఒకటి రెండు సంవత్సరాలలో తీవ్రమైన వరదలు లేదా తుపానులు సంభవిస్తాయని   ప్రజల నమ్మకం.

ఇక పోతే భూకంపాలు  పెను తుపానుల సమయంలో వాతావరణ పీడనంలో వచ్చే మార్పులను జంతువులు, పక్షులు,  తక్షణమే స్పందించి ప్రకటిస్తాయి. భూకంపాలు సంభవించే ముందు భూగర్భం నుంచి  రాడాన్  అనే ప్రత్యేక వాయువు విడుదలవుతుంది. దీని ప్రభావంతో యూకలిప్టస్, పైన్ వంటి చెట్ల ఆకులు అకస్మాత్తుగా పసుపు రంగులోకి మారిపోతాయి. అలాగే విద్యుత్ క్షేత్రాల మార్పుల వల్ల రావి చెట్ల ఆకులు ఒకదానికొకటి అతుక్కుపోయి శబ్దం చేయడం మానేస్తాయి. తుపాను రాకకు రెండు రోజుల ముందే తాటి చెట్ల మట్టలు  రెపరెపలాడడం ప్రారంభిస్తాయి. వాతావరణ పీడనం ఒక్కసారిగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. కానుగ చెట్ల పువ్వులు తుపానుకు ముందస్తు రోజు సాయంత్రం వేళల్లో రాలిపోతాయి. ఇక జంతువుల విషయానికి వస్తే..  కుక్కలు అరిచి గోల చేయడం,  పాములు పుట్టలు వీడి బయటికి రావడం, చేపలు నీటి ఉపరితలానికి ఎగిరిపడడం వంటి సంకేతాలతో విపత్తుల గురించిన ముందస్తు హెచ్చరికలు చేస్తాయి.  గత కాలంలో మన పెద్దలు ప్రకృతి చేసే ఈ ముందస్తు హెచ్చరికలను బట్టి అప్రమత్తమయ్యే వారు.  

ప్రకృతి ప్రకోపానికి బలి కాకుండా ఉండాలంటే  పర్యావరణంలోని మార్పులపై కన్నేసి ఉంచాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వృక్షాలు, జంతువుల ప్రవర్తనలో వచ్చే సూక్ష్మ మార్పులను విస్మరించకూడదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.  ముందస్తు అప్రమత్తతే విపత్తుల నుంచి కాపాడే రక్షణ కవచమని  అంటున్నారు. 

[Nature Early Caution On Natural Disasters, Signs, Trees, Animals, Birds, Weather Changes,Telugu One]

By
en-us Political News

  
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.