ఏపీ రైతుల రుణమాఫీ.. బ్యాంకుల ఓవర్ యాక్షన్!

Publish Date:Oct 20, 2014

Advertisement

 

రైతు రుణమాఫీ... ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రత్యర్థులు ఆలోచించడానికి కూడా బెంబేలెత్తిపోయిన అంశం. రాష్ట్రంలో పేద రైతుల కష్టాలను అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు అర్హులైన పేద రైతులందరికీ వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కట్టుబడి వున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అర్హులైన రైతుల రుణాలు మాఫీ మాఫీ చేయడానికి ఆయన కసరత్తు చేస్తున్నారు. రైతులకు ఆదుకోవడానికి ఆదాయ మార్గాల అన్వేషణలో, తగిన ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమై వున్నారు. ఈ విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధిని రైతులు కూడా అర్థం చేసుకుని సహకరిస్తున్నారు.

 

రైతుల రుణమాఫీ అంటే బొజ్జ నిండిన భూస్వాములు ఊబుసుపోక తీసుకున్న రుణాలు మాఫీ చేయడం కాదు. భూమి మీద అప్పు తీసుకుని వాటితో వడ్డీ వ్యాపారాలు చేసే బడాబాబుల పాలిట వరప్రసాదం కాదు. పంటలు ఏవీ వేయకపోయినా భూములు ఉన్నాయి కాబట్టి క్రాప్ లోన్ పేరిట తీసుకున్న రుణాలను మాఫీ చేయడం ఎంతమాత్రం కాదు. నిజానికి రైతు రుణమాఫీ అంటే... ఇతరులకు అన్నం పెట్టే ప్రయత్నంలో వివిధ కారణాల వల్ల తన కడుపు మాడే పరిస్థితికి వచ్చిన నిరుపేద రైతుల రుణాలు మాఫీ చేయడం. అలాంటి పేద రైతుల రుణాలు మాఫీ చేయడమే చంద్రబాబు నాయుడు ప్రధానోద్దేశం. రుణమాఫీ చేయడానికి నిజమైన అర్హులైన రైతుల రుణాలను మాఫీ చేయడమే న్యాయంగానీ, బడాబడా భూస్వాములకు మేలు చేయడం ఎంతమాత్రం న్యాయం కాదు. అందుకే ఈ విషయంలో అర్హులైన రైతులకు అన్యాయం జరగకూడదు. అనర్హులైన వారికి అప్పనంగా రుణమాఫీ చేయకూడదు.

 

చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 30వ తేదీ, 2013 సంవత్సరంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ ప్రస్తావన తెచ్చారు. అంటే ఆ ఏడాది రైతులు తీసుకున్న పంట రుణాల మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కోరిన మేరకు బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాలను లెక్కగట్టడం ప్రారంభించాయి. అన్ని రకాలుగా లెక్కలు వేసి మొత్తం రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 5 లక్షల రైతుల బ్యాంకు ఖాతాలు వున్నాయని, ఆ ఖాతాలున్న రైతులు తీసుకున్న రుణాలు 87,612 కోట్లు అని తేల్చాయి. ఈ అంకె చూసి ప్రతిపక్ష నాయకుడు జగన్ గుడ్లు తేలేశాడు. ఇంత భారీ మొత్తంలో రుణాలు వుంటాయి కాబట్టే రైతు రుణమాఫీ సాధ్యం కాదని తాను ముందే చెప్పానని కాకలు తీరిన ఆర్థికవేత్తలాగా ప్రకటనలు చేశాడు. కొంతమంది అయితే చంద్రబాబు నాయుడు ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ ఎలా చేస్తాడో ఏంటోనని సానుభూతి వ్యక్తం చేశారు. అయితే నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాఫీ చేయాల్సిన రుణాలు ఇంత భారీ స్థాయిలో లేవు. ‘తెలుగువన్’ చేసిన పరిశోధనలో అనేక ఆసక్తికర విషయాలు, బ్యాంకుల తెలివితేటలు బయటపడటంతోపాటు... అర్హులైన రైతుల రుణాలు మాఫీ చాలా సులభంగా చేయొచ్చని కూడా క్రిస్టల్ క్లియర్‌గా తెలిసిపోయింది.

 

నిజానికి బ్యాంకులు ప్రకటించిన 87,612 కోట్లు ఈ ఏడాది తీసుకున్న రైతు క్రాప్ రుణాల మొత్తం కాదు... ఈ మొత్తంలో చంద్రబాబు ప్రకటించిన సంవత్సరానికి కాకుండా అంతకు ముందు సంవత్సరాలలో తీసుకున్న రైతు రుణాలు 30,190 కోట్లు వున్నాయి. దశాబ్దాల తరబడి మొండి బకాయిలుగా మిగిలిపోయి, బ్యాంకులు కూడా వసూలు చేయలేక చేతులు ఎత్తేసిన రుణాలు 6,480 కోట్లు వున్నాయి. ఇక బంగారం తాకట్టు పెట్టి వ్యక్తిగత అవసరాల కోసం, వ్యవసాయేతర పనుల కోసం తీసుకున్న రుణాలు, రుణమాఫీ పరిధిలోకి రాని హార్టీకల్చరల్ రుణాలు, భూస్వాములు తీసుకున్న రుణాలు, ఒకే కుటుంబంలో ఒకరికి మించి తీసుకున్న రుణాలు..... ఇలా రకరకాల ‘మాఫీ’తో సంబంధం లేని రుణాలన్నీ కలిపి 87,612 కోట్లు అయింది. ఈ మొత్తంలో ప్రభుత్వం నిజంగా మాఫీ చేయాల్సిన రుణం కేవలం 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుంది.

 

అయితే బ్యాంకులు మాత్రం తెలివిగా ఈ లెక్కలను బయటపెట్టడం లేదు. నిజానికి ప్రభుత్వం చేయాల్సిన రుణమాఫీ 15 నుంచి 20 వేల కోట్ల రూపాయల మధ్యలో వున్నప్పటికీ ఆ లెక్కలు, అంకెలను బయటపెట్టకుండా ‘‘రైతులు బ్యాంకులకు 87,612 కోట్లు బాకీ వున్నారు’’ అనే విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నాయి. ఇక్కడ బ్యాంకుల స్వార్థం ఏమిటంటే, ప్రభుత్వం ఎలాగూ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది కాబట్టి, ఎన్నో సంవత్సరాలుగా తాము ఇచ్చిన రుణాలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన వేసేసి తాము చేతులు దులిపేసుకుంటే ఒక పనైపోతుంది కదా అనే!చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలు మాఫీ చేయడం చాలా సులువైన విషయం. అయితే మధ్యలో బ్యాంకులు మైండ్ గేమ్ ఆడుతూ స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ వుండటం వల్లే రైతు రుణమాఫీ అంశం చాలామందికి భూతద్దంలో కనిపిస్తూ భయపెడుతోంది. నిజానికి బ్యాంకులు ఇప్పటికైనా చంద్రబాబుతో మైండ్ గేమ్ ఆడటం ఆపేయాలి. రైతు రుణమాఫీ అంశాన్ని అడ్డు పెట్టుకుని అవకాశవాదంతో, స్వార్థంతో వ్యవహరించడం మానుకోవాలి. ఇంతకాలం తాము భరిస్తున్న రుణాల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన వేయాలని భావించడం పద్ధతి కాదని తెలుసుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సిన వాస్తవ రుణాన్ని బ్యాంకులు ఎలాంటి తిరకాసులు పెట్టకుండా బయటపెడితే పేద రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది.

By
en-us Political News

  
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.