ప్రపంచ వాణిజ్యానికి అమెరికా సెక్యూరిటీ కాదు.. హెర్మూజ్ రక్షణ నాటో దేశాలదేనన్న ట్రంప్

Publish Date:Apr 10, 2026

Advertisement

నాటో దేశాలపై అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో సారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హెర్మూజ్ జలసంధి రక్షణ విషయంలో నాటో దేశాల తీరును తప్పుబట్టారు.   హెర్మూజ్ భద్రత కోసం అమెరికా భారీగా నిధులు వెచ్చిస్తోందనీ, అయితే..  ఆ జల సంధి వల్ల ప్రయోజనం పొందుతున్న నాటో దేశాలు మాత్రం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.  దశాబ్దాలుగా అమెరికా బాధ్యత మోస్తోందన్న అమెరికా అధ్యక్షుడు.. నాటో దేశాల తీరు సరికాదని అన్నారు.  

ప్రపంచ చమురు రవాణాలో హెర్మూజ్‌ జలసంధి  ద్వారా జరిగే వాణిజ్యంపై అనేక ఐరోపా దేశాలు మరియు ఆసియా దేశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే.. ఇక్కడ నౌకల రాకపోకలకు భద్రత కల్పించేందుకు అమెరికా తన నౌకాదళాన్ని, యుద్ధ విమానాలను మోహరించి భారీగా ఖర్చు చేస్తుంటే.. నాటో   దేశాలు ఈ బాధ్యత పంచుకోవలసింది పోయి చోద్యం చూస్తున్నాయని ట్రంప్ రుసరుసలాడారు.  

గత కొంతకాలంగా ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్‌ జలసంధి భద్రత  అంతర్జాతీయ సమస్యగా మారిందన్న ట్రంప్..  నాటో దేశాలు కేవలం ప్రేక్షక పాత్ర పోషించడం సరికాదని, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉమ్మడిగా పని చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. హెర్మూజ్ భద్రత అమెరికా కు కాదనీ, నాటో దేశాలకే ఎక్కువ అవసరమని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.   చైనా, జపాన్ వంటి ఆసియా దేశాలతో పాటు ఐరోపా దేశాలు తమ చమురు అవసరాల కోసం ఈ మార్గాన్ని వాడుకుంటున్నాయనీ..  కాబట్టి ఆయా దేశాలే తమ నౌకలకు రక్షణ కల్పించుకోవాలని అన్నారు.  తమ సైన్యం ఉచితంగా ప్రపంచ వాణిజ్యానికి కాపలా కాయడం ఇంకానా ఇకపై ఉండదన్న సంకేతాన్ని ట్రంప్ ఇచ్చారు. 

ట్రంప్ మాటలను బట్టి ముందు ముందు హెర్మూజ్‌ జలసంధి రక్షణకు సంబంధించి అమెరికా తన వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికీ నాటో దేశాలు స్పందించకుండా హెర్మూజ్ ప్రాంతం నుంచి అమెరికా తన దళాలను ఉపసంహరించుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.  

By
en-us Political News

  
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.