రాష్ట్రాన్ని దోచుకుంటున్న సిండికేట్లు, బినామీలు
Publish Date:Apr 27, 2012
Advertisement
రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా బినామీలు, సిండికేట్లదే రాజ్యంగా కనిపిస్తోంది. గ్రామాలు, చిన్న పట్టణాలు మొదలుకొని నగరాలలో వివిధరకాల వ్యాపారాలు చేసేవారు సిండికేట్లుగా ఏర్పడుతున్నారు. మద్యం వ్యాపారం చేసేవారే కాకుండా ఇసుక, సున్నపురాయి వంటి మైనింగ్ వ్యాపారాలు చేసేవారు కూడా సిండికేట్లుగా వున్నారు. ఈ సిండికేట్లలలో కూడా తమవద్ద పనిచేసే వారిని, బంధువులు, మిత్రులను బినామీలుగా వుంచారు. అయితే ఇందులో బినామీలుగా వున్నవారిలో కూడా అత్యధికులు తెల్లరేషన్ కార్డు దారులే. ఇటీవల కృష్ణాజిల్లా నందిగామ ప్రాంతంలో రెండు కోట్ల రూపాయలకు ఇసుక క్యారీకి టెండర్ వేసిన వుఅక్తి కూడా తెల్లరేషన్ కార్డుదారుదేనని అధికారులు గుర్తించడం అందుకు ఉదాహరణ. మద్యం బినామీలపై ప్రస్తుతం ఎసిబి దాడులు జరుగుతున్నా నేపథ్యంలో రేపు ఆ దాడులు తమమీద కూడా జరుగుతాయేమోనని ఇతర రంగాలలోని సిండికేట్లు, బినామీలు కంగారు పడుతున్నారు. కొంతమంది బినామీలు తమవద్ద వున్న తెల్ల రేషన్ కార్డులను రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్నట్టు సమాచారం అందింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల్లో మద్యం వ్యాపారులలో బినామీదారులే కాకుండా నిజంగా వ్యాపారం చేసేవారు కూడా తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారు వున్నారు. వీరు తెల్ల రేషన్ కార్డులపై బియ్యం, కిరోసిన్ తెచ్చుకోకపోయినా రాజీవ్ ఆరోగ్యశ్రీ పతకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్డులను పొందారు. వీరు కూడా తమవద్ద తెల్ల రేషన్ కార్డులను అధికారులకు అప్పగిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/alcohol-syndicates-24-13674.html





