ఢిల్లీకి బయల్దేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!
Publish Date:Sep 10, 2026
Advertisement
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఢిల్లీకి బయల్దేరారు. ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మీ, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ వాణిదేవి ఢిల్లీకి బయలుదేరారు. మొన్న అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనను జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ చైర్మన్‌ను కలిసి ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కూడా కలిసి అసెంబ్లీ పరిసరాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేయనున్నారు. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనను జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనకు బయల్దేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. [ BRS MLAs leave for Delhi, Sunitha Lakshma Reddy, Sabitha Indra Reddy, Kova Lakshmi, Jagadish Reddy, Palla Rajeshwar Reddy, BRS Party, KCR, KTR, CM Revanth reddy ]
http://www.teluguone.com/news/content/brs-mlas-leave-for-delhi-24-231184.html





