అక్కడ అవినీతి చేపలదే ఇష్టారాజ్యం
Publish Date:Feb 28, 2012
Advertisement
నిద్రావస్థలో 'పశ్చిమ' ఏసిబి మద్యం సిండికెట్లు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల గుట్టును రట్టు చేయాల్సిన ఏసిబి అధికారులు చివరకు తమగుట్టును బైటపెట్టుకోవడంతో ఈ పరిస్థితి తెలెత్తింది. విజయవాడలోని ఏసిబి సిఐ ఒకరిని ఇక్కడ ఇన్ చార్జిగా వేస్తే ఆయన కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక్కడ డిఎస్పీగా పనిచేసిన నర్సంహమూర్తి ఏడునెలలు క్రితం వేరే చోటుకు బదిలీపై వెళ్ళారు. అప్పటినుంచి ఇక్కడకు మరో డిఎస్పీ రాలేదు. ఇద్దరు సిఐలతోనే చాలాకాలం బండి నడిపించారు. మద్యం సిండికెట్లపై దాడులు జరగడానికి ముందు ఇద్దరు సిఐల్లో ఒకరైన లక్ష్మీపతికి డిఎస్పీగా పదోన్నతి లభించడంతో ఆయన ఇక్కడనుంచి వెళ్ళిపోయారు. దీంతో ఏసిబిలో ఒకే ఒక్కడుగా సిఐ సుబ్బరాజు కొంతకాలం అంతా తానై చక్రం తిప్పారు. ఈ నేపధ్యంలో మద్యం సిండికెట్లపై దాడుల పర్వాన్ని జిల్లాలో తూతూ మంత్రంగానే ముగించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిపిన దాడుల్లో పాల్గొన్న ఇక్కడి సిఐ సుబ్బరాజు అ దాడుల సమాచారాన్ని లీక్ చేయడంతో పాటు కొందరి పేర్లను జాబితానుంచి తప్పించారన్న ఆరోపణలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఏసిబి ఉన్నతాధికారులు ఆయన్ను మాతృశాఖకు సరండర్ చేశారు.దీంతో జిల్లాలో ఏసిబి అధికారులు లేని విభాగంగా మారింది. ప్రస్తుతం విజయవాడ ఏసిబిలో సిఐగా పనిచేస్తున్న రవిని ఇక్కడ ఇన్ చార్జిగా నియమించారు. రోజుకోరకంగా మారుతున్న పరిణామాల్లో ఆయన ఇటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదని తెలుస్తోంది.
తెలుగువన్.కామ్ ప్రత్యేక స్పెషల్ స్టోరీ
పశ్చిమగోదావరి జిల్లా: ఏసిబి వలలో భారీ అవినీతి చేప వంటి హెడ్ లైన్స్ మనం అనేకం చూసిఉంటాం. అయితే పశ్చిమగోదావరి జిలాల్లో మాత్రం ఇటువంటి శీర్షికలు పెద్ద పెద్ద బూతద్దాలు పెట్టి చూసినా కనిపించవు. ఎందుకంటే ఈ జిల్లాలో అవినీతి నిరోధకశాఖ నిద్రావస్థలో ఉంది. సిబ్బంది లేక తరచు మూసివేసే ఉంటుంది. ఒక డిఎస్పీ, ఇద్దరు సిఐలు, 30 మంది సిబ్బందితో కళ కళలాడాల్సిన పశ్చిమగోదావరి జిల్లా ఏసిబి కార్యాలయం ఇప్పుడు వెల వెలబోతోంది. ప్రస్తుతం ఒక హెడ్ కానిస్టేబుల్, ఆరుగురు కానిస్టేబుళ్ళు మాత్రం ఇక్కడ మిగిలారు.
http://www.teluguone.com/news/content/acb-24-12267.html





