Publish Date:Feb 28, 2012
నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలోని కనిగిరి రిజర్వాయర్ కబ్జాకోరల్లో చిక్కుకుంది. దీంతో ఆయకట్టు భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. దురాక్రమణదారుల కబ్జాలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. కనిగిరి రిజర్వాయర్ కింద సంగం మండలంలో పెద్దగా ఆయకట్ట లేదు. రిజర్వాయర్ ఎగువభాగం మండల పరిధిలో ఉంది. పడమటి వైపున జంగాల కండ్రిక, వంగల్లు, గాంధీ జనసంఘం, సిద్దిపురం, దువ్వూరు గ్రామాలున్నాయి. కొన్నేళ్ళ నుంచి రిజర్వాయర్ పడమటి వైపు ఉన్న మెట్టభూమి అంచలంచలుగా కబ్జాకు గురవుతూ ఉంది. అయినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. రిజర్వాయర్ భూమి అనధికారికంగా అమ్మేస్తున్నారు.రిజర్వాయర్ పూడిక పేరుకుపోతుండటంతో నీటి సామర్ధ్యం బాగా పడిపోయింది. రిజర్వాయర్ ముందుభాగాన మాత్రం నీరు ఉండటం, పడమటి వైపు మిట్ట తేలిపోవడంతో అక్కడ భూమి సారవంతమైన సాగుకు అనుకూలంగా మారింది. దీంతో బడాబాబుల కళ్ళు దీనిపై పడ్డాయి. తొలుత రిజర్వాయర్ లో ఆయిల్ మోటార్లు ఏర్పాటు చేసుకుని వరి, పత్తి సాగుచేస్తుండేవారు. బడాబాబులు క్రమేణా రిజర్వాయర్ లో విధ్యుత్ లైన్లు ఏర్పాటు చేసుకున్నారు. కాలువలు, బాటలు కూడా వేశారు. దీంతో రిజర్వాయర్ పంటలు సిరులు కురిపిస్తుండటంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ రిజర్వాయర్ లో సుమారు నాలుగువేల ఎకరాలకు పైగా కబ్జాకు గురయింది. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి రిజర్వాయర్ లో ఆక్రమణలను నివారించాల్సిన అవసరం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nellore-district-24-12266.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.