2014 ఎన్నికల్లో పోటీచేయను
Publish Date:Jan 28, 2012
Advertisement
న్యూఢిల్లీ: 2014 లోక్‌సభకు జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీచేయనని కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. యువతరానికి అవకాశం కల్పించేందుకు రాజకీయాలకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ఎన్‌సిపి తదనంతర నాయకత్వం తన కుటుంబం నుంచే వస్తుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ...తమ పార్టీకి వంశపారంపర్య రాజకీయాల పట్ల విశ్వాసం లేదని తెలిపారు. కాగా పవార్ తనయ సుప్రియా సులే ఎంపీగా, ఆయన మేనల్లుడు అజిత్ పవార్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతుండడం గమనార్హం.
1967లో రాజకీయాల్లోకి అడుగిడిన పవార్ అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఎన్నికల్లో ఓడిపోకపోవడం గమనార్హం.1985 మార్చిలో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైన ఆయన ఇప్పటివరకు ఏడు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1999లో కాంగ్రెస్‌తో విభేధించి ఎన్‌సిపిని ఏర్పాటు చేశారు. మూడు పర్యాయాలు మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన పవార్ కేంద్రంలో రక్షణశాఖా మంత్రి సహా పలు కీలక పదవులను నిర్వహించారు.
http://www.teluguone.com/news/content/2014-elections-24-11368.html





