Publish Date:Aug 26, 2012
రాష్ట్ర ప్రభుత్వాలు సీనియరిటీని పక్కనపెట్టి అస్మదీయులకు డిజిపి పదవి ఇవ్వడం ఒక తంతుగా మారింది. కోర్టుల్ని కూడా లెక్కచేయకపోవడం అలవాటుగా మారిపోయింది. దీనివల్ల లౌక్యం తెలియని ఐపియస్ ఆఫీసర్లు బలౌతున్నారు.1975 బ్యాచ్ కు చెందిన గౌతంకుమార్ దీనికి మంచి ఉదాహరణ. అప్పట్లో సీనియారిటీని తోసిరాజని అరవింద్ రావుకి డిజిపి పదవిని కట్టబెట్టారు. తనకు న్యాయం చేయాలని గౌతంకుమార్ హైకోర్ట్ ని ఆశ్రయించడంతో ఆయనకే అనుకూలంగా తీర్పొచ్చింది. ప్రభుత్వం దీనిపై డివిజన్ బెంచ్ కి పిటిషన్ దాఖలు చేసింది. వ్యవహారం తేలేలోగా అరవింద్ రావు రిటైరైపోయారు. తర్వాత కూడా గౌతం కుమార్‌కి ప్రభుత్వం మొండి చెయ్యి చూపి దినేష్‌రెడ్డిని డిజిపిగా నియమించింది. దినేష్ రెడ్డి డిజిపి నియామక సమయానికి కెఆర్ నందన్ కి సీనియారిటీ ఉంది. కానీ.. ఆయన ఆ కుర్చీలో కూర్చోవడానికి ఇష్టపడలేదు. తర్వాతి వంతు న్యాయనికి గౌతంకుమార్ ది. కానీ.. ప్రభుత్వం ఆయన్ని కాదని దినేష్ రెడ్డిని కుర్చీలో కూర్చోపెట్టింది. గౌతంకుమార్ కి సీనియారిటీతోపాటు సమర్థత కూడా ఉంది. కానీ లాబీయింగ్ లో మాత్రం చాలా వీక్.. అందుకే పదవిని రెండుసార్లు వేరేవాళ్లు తన్నుకు పోయారు. దినేష్‌రెడ్డి 1977 బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్. కానీ.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో ఆయనకున్న సంబంధ బాంధవ్యాలు అదృష్టాన్ని మోసుకొచ్చాయి. క్యాట్ కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టింది. పట్టించుకోని ప్రభుత్వం మళ్లీ అప్పీలుకెళ్లింది. మనస్తాపంతో గౌతంకుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-గౌతం-కుమార్‌కు-నష్ట-పరిహారం---24-16880.html
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.