విశాఖ ఉక్కుకు చెదలు

Publish Date:Jul 24, 2012

Advertisement

ప్రపంచ ప్రఖ్యాత స్టీలుప్లాంటులో కేంద్ర ప్రభుత్వం తన పెట్టుబడుల్లో పదిశాతం వాటాను ఉపసంహరించుకోనుంది. ఇలా కొద్ది కొద్ది వాటాలు వెనక్కితీసుకుంటూ చివరికి ఈ పరిశ్రమను పూర్తిగా ప్రయివేటు పరం చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీని వల్ల ఇప్పటి వరకూ ఉన్న కార్మికుల భద్రత కూడా కొరవడుతుంది. అంతేకాకుండా ప్రభుత్వరంగంలో లాభాలార్జిస్తున్న ఏకైక పరిశ్రమ ఈ విశాఖ ఉక్కుపరిశ్రమ. జాతికి అంకితమైన ఈ పరిశ్రమ ప్రైవేటుపరమైతే ఆ పారిశ్రామికవేత్తలు మరిన్ని లాభాలను ఆర్జించటంతో పాటు ప్రపంచస్టీలుమార్కెట్టును శాసించటం ఖాయం. ఇప్పటి వరకూ ఈ స్టీలురంగంలో భారతీయులే ఎక్కువగా రాణిస్తున్నారు. అందుకే టాటాస్టీలు, మిట్టల్‌ స్టీలు పరిశ్రమలు అంతర్జాతీయఖ్యాతిని ఆర్జించాయి. లాభాలబాటలో ఉన్న పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రభుత్వంలో కొందరు పెద్దల స్వలాభానికి దోహదపడుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 అందుకే విశాఖపరిశ్రమలోని సుమారు 17వేల మంది కార్మికులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమబాట పడుతున్నారు. ఎఐటియుసి, సిఐటియు, ఐఎన్‌టియుసి, బిఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, టిఎన్‌టియుసి తదితర కార్మికసంఘాలు ఈ ఉద్యమాలకు నేతృత్వం వహిస్తున్నారు. మొదట్లో ప్రభుత్వం ఈ నెల 25న ఐపీఓ జారీ చేద్దామని నిర్ణయించుకుంది. కానీ, మార్కెట్టుపరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో ఆ ప్రతిపాదన మార్చుకుంది. దేశచరిత్రలోనే ఓ ప్రధాని జాతికి అంకితం చేసి లాభాల బాటలో నడిచే గర్వకారణమైన ఈ స్టీలు పరిశ్రమ మరొకటి లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తు తెచ్చుకునేలా కార్మికులు ఉద్యమబాట పడుతున్నారు. మంగళవారం మొత్తం ప్రొడక్షన్‌ను ఆపేసి మరీ తమ నిరసన గళాన్ని వినిపించారు. కార్మికుల ఉద్యోగభద్రత దృష్ట్యా ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన విరమించుకోవాలని, పెద్దలు కూడా తమ స్వలాభాన్ని మానుకుని పరిశ్రమను యథాతథంగా నడిపేలా చూడాలని కార్మికనేతలు,రాష్ట్రప్రజలు కోరుకుంటున్నారు.

By
en-us Political News

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.