వాన్‌పిక్‌ తో తెలుగు దేశం లాభపడుతుందా?

Publish Date:Jul 24, 2012

Advertisement

తెలుగుదేశం పార్టీ తన బలాన్ని పెంచుకునే కసరత్తులకు శ్రీకారం చుట్టింది. ముందస్తుగా బిసీల బలాన్ని పెంచుకునేందుకు ఇటీవల కృషి చేసిన ఆ పార్టీ ఇప్పుడు సమస్యల వారీగా పరిశీలనలు ప్రారంభించింది. అందులో భాగంగానే  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అథ్యక్షుడు జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో కీలకమైన వాన్‌పిక్‌ భూముల సమస్యను తెలుగుదేశం పార్టీ భుజానికి ఎత్తుకుంటోంది. ఈ సమస్యపై పోరాడితే కనీసం ప్రకాశం జిల్లాలో రైతుల మనస్సు గెలుచుకోవచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందుకే కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలను మినహాయించి అన్ని పార్టీలనూ కలుపుకునేందుకు టిడిపి రంగం సిద్ధం చేసుకుంది.


 

 దానిలో భాగంగానే ఈ నెల 25న ఒంగోలులో రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్సు ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశం తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాన్‌పిక్‌భూముల విషయంలో తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి అంటున్నారు. తమ పార్టీ అథినేత చంద్రబాబు కూడా ఈ కార్యక్రమం గురించి ఉత్సుకత చూపుతున్నందున ఈ రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల ముఖ్యనాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అథ్యక్షుడు దామచర్ల జనార్దన్‌,మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ఈ కార్యక్రమ ఏర్పాట్లలో ఉన్నారు.
 

By
en-us Political News

  
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.