Publish Date:Dec 13, 2012
సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ములాయం తో పాటు ఆయన కుమారుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ ల ఫై విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీం సిబిఐ ను ఆదేశించింది. ఈ తీర్పును ములాయం స్వాగతించారు. ఈ విచారణతో తనఫై ఉన్న ఆరోపణలు తొలగిపోతాయని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో సిబిఐ తనఫై విచారణ చేయడాన్ని సవాల్ చేస్తూ ములాయం గతంలో సుప్రీం ను ఆశ్రయించారు. దీనిఫై విచారణ చేసిన సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తన దర్యాప్తును స్వతంత్రంగా చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సిబిఐ ను ఆదేశించింది. ములాయం మరో కుమారుడు ప్రతీక యాదవ్ ఫై కూడా విచారణ చేయాలని సుప్రీం ఆదేశించింది. అయితే, ఈ కేసునుండి అఖిలేష్ భార్య డింపుల్ కు కోర్టు మినహాయింపును ఇచ్చింది.
2007 మార్చి 1వ తేదీన సుప్రీం ములాయం ఆస్తులఫై విచారణకు ఆదేశించింది. అప్పటినుండి సిబిఐ ఈ విచారణను నిర్వహిస్తోంది. మరోవైపు ములాయం ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో సమావేశమయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-supreme-court-mulayam-singh-yadav-43-19727.html
విశాఖ వేదికగా జరగనున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో అపారంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలకు బలంగా చాటిచెప్పాలన్నారు. విధాన రూపకర్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్స్ మధ్య బలమైన వారధిగా ఈ సదస్సు నిలవాలని చంద్రబాబు పేర్కొన్నారు.
మొత్తం 365 కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని.. 19,885 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ నిఘాతో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీవోర్న్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కాలంగా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా సంచలన విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.
రాప్తాడు బాలిక లక్ష్మి సాహసానికి గుర్తింపు.. చదువుకు అండగా ఆనంద్ మహీంద్రా.!
ఆచార్య ఎన్.జి. రంగా 127వ జయంతి సందర్భంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌కు ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారం ప్రదానం చేశారు.
ప్రస్తుతం అనంతపురంలో ఉన్న కియా తయారీ కేంద్రానికి ఏటా 3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఈ తాజా పెట్టుబడి ద్వారా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత భారీగా పెంచాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు దశలలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు పేర్కొంది. ఇందు కోసం దశలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నవంబర్ 13, రెండో విడత నోటిఫికేషన్ ను నవంబర్ 18న, ఒక మూడో విడత నోటిఫికేషన్‌ను నవంబర్ 19వ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది.
4 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఉన్నాయి. గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
నష్టంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. కేంద్రానికి సమగ్ర నివేదిక.!
హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!
రాప్తాడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.
జగన్ హయాంలో చెవిరెడ్డి నుంచుంటే మాస్, కూర్చుంటే మాస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకపక్ష అరాచకాలు, బెదిరింపు రాజకీయాలతో చెలరేగిపోయేవారు. అటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. పరిషత్ పోలింగ్ వేళ చుక్కలు చూపించారు పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు, విచారణను ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి ఇతర రాష్ట్రాలకు మార్చాలన్న ఆ పిటిషన్ ను విచారణ చేపట్టిన సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం కుండబద్దలు కొడుతూ, . పిటిషన్‌ను కొట్టివేసింది.