రాహుల్‌కి రాజకీయాలు అవసరమా?

Publish Date:Jul 21, 2012

Advertisement

ఇక కీలక బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్దమని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఇదే  విషయమై స్వపక్ష్యం, ప్రతిపక్షాలనుండి రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ప్రణబ్‌ రాష్ట్రపతి పదవికి పోటీచేయడంతో ఏర్పడిన గ్యాప్‌ను నింపడానికే రాహుల్‌గాంధీని క్రియాశీలక పాత్రలోకి తెస్తున్నారంటున్నారు. తరతరాలుగా దేశంకోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల కుటుంబం నుండి వచ్చారన్న  భజన తప్ప నాయకత్వ లక్షణాలుగాని, సైద్దాంతిక లక్షణాలు గాని రాహుల్‌ లో కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.


 

ప్రత్యర్థులపై ఆయన ప్రభావం శూన్యం. దేశాన్ని  మున్ముందు ఎలా నడిపించాలన్న ఎజెండా ఏమీ ఆయన దగ్గరనుండి ఆశించలేము అని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నారు. మొదటి ప్రధానిగా భారతదేశాన్ని సుస్థిరం చేసిన ఘనత  ఆనాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ఉంది. పంచవర్ష ప్రణాళికల ద్వారా  ఆయన దేశానికి జవసత్యాలు అందించారు. ఆ తర్వాత ప్రధాని అయిన లాల్‌బహదుర్‌ శాస్త్రి ఎక్కువకాలం ప్రధానిగా లేరు. ఆయన ఆకస్మిక మృతితో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా 20 పధకాలతో ముందుకుసాగారు. ఆమె తరువాత రాజీవ్‌గాంధీ ఐ.టి. యుగానికి బాటలు వేసి యువతరంలో ఉత్సాహం నింపారు. వీరి వారసుడైన రాహుల్‌కు వారి లక్షణాల్లో ఒక్కటి కూడా అబ్బలేదని ఆయనను సన్నిహితంగా పరిశీలిస్తున్నవారు అంటున్నారు.



 మొన్న జరిగిన యుపి ఎన్నికలో రాహుల్‌ చమటోడ్చి పనిచేసినప్పటికి ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. అయినా ప్రస్తుతం కాంగ్రెస్‌కి ఉన్న ఒకే ఒక అస్త్రం రాహుల్‌ మాత్రమే. ఆయన వల్ల పార్టీకి ఇప్పటిదాకా పెద్ద ప్రయోజనం చేకూరలేదు. ఒకవేళ ఆయన ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరిస్తే ఎలా ఉంటుందన్న దానిపై  కూడా సందేహాలు ఉన్నాయి. బాబారామ్‌దేవ్‌ , అన్నా హజారే ల సత్యాగ్రహాలను ఆయన చులకన చేసి మాట్లాడడం, దేశం ఎన్నో  సమస్యలు ఎదుర్కోంటున్నా ఆయన ఏనాడు పార్లమెంట్‌లో వాటిని ప్రస్తావించకపోవడాన్ని చూస్తే ఆయన కు ప్రభుత్వ వ్యవహాహారలపై కూడా ఆవగాహన లేదనిపిస్తోంది.



 స్వపక్షం రాహుల్‌ జపం చేయడమేకాని దేశంలో ఎవరికీ ప్రిన్స్‌ మీద అంచనాలు లేవని తెలుస్తుంది. త్వరలో  గుజరాత్‌ ,హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగబోయే ఎన్నికల్లో గాని  ఆ తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్‌ మొదలైన రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల్లో గాని రాహుల్‌ చరిస్మా ఎంతవరకు పనిచేస్తుందో అనుమానమే.  కాబట్టి పార్టీ పరంగాకాని, ప్రభుత్వ పరంగా కాని రాహుల్‌ గాంధీ క్రియాశీలక పాత్ర పై ఆశలు పెట్టుకుంటే అత్యాశే అవుతుంది.

By
en-us Political News

  
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.