ముంబైనీ చిత్తుచేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్
Publish Date:Apr 17, 2012
Advertisement
ఐపీఎల్-5లో హోరాహోరీగా సాగాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 92 పరుగులకే ఆలౌటై కనీసం పోరాడకుండానే సొంతగడ్డపై చేతులెత్తేసింది. చెత్త బ్యాటింగ్‌తో ఈ సీజన్‌లోనే అత్యల్పస్కోరు (92)కు ఆలౌటయింది. స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ జట్టు 19.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 14.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసి మరో 31 బంతులు మిగిలుండగానే నెగ్గింది. ఓపెనర్లు సెహ్వాగ్ (36 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్సర్), నమన్ ఓజా (15 బంతుల్లో 13; 2 ఫోర్లు) కుదురుగా ఆడారు.రెండు కీలక వికెట్లు తీసిన ఢిల్లీ స్పిన్నర్ నదీమ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
http://www.teluguone.com/news/content/-mumbai-indians-delhi-daredevils-24-13413.html





