జగన్ హయాంలో సామ్రాజ్యంగా విస్తరించిన మతమార్పిడి నెట్ వర్క్.. విజయసాయి.!

Publish Date:Aug 24, 2026

Advertisement

నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడు, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి.. ఇప్పుడు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున బలవంతపు మతమార్పిడులు జరిగాయనీ, లవ్ జిహాద్  పేర పెద్ద ఎత్తున అమాయకులను మోసం చేశారనీ విమర్శలు గుప్పించారు. కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు  కుటుంబాన్ని పరామర్శించిన విజయసాయి రెడ్డి కోనసీమలో మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో జగన్    ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో మత మార్పిడులను విపరీతంగా ప్రోత్సహించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక మతమార్పిడి కుట్ర దాగి ఉందన్న విజయసాయి అందుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు.  వైసీపీ హయాం  నుంచే ఆంధ్రప్రదేశ్‌లో  లవ్ జిహాద్,    అక్రమ మత మార్పిడుల నెట్‌వర్క్ క్రియాశీలకంగా మారాయన్న ఆయన..  అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతోనే సాదిక్ ఖాన్ లాంటి కరడుగట్టిన నేరస్థులు రెచ్చిపోయారన్నారు.  అమాయక హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేశారని విమర్శించారు.  

ఈ అక్రమ మత మార్పిడి ముఠా కేవలం మతం మార్చడమే కాకుండా, బాధితుల  ఆస్తులను అక్రమంగా కాజేసిందన్నారు.  రావులపాలెంలో ఏఈ నూకరాజుకు చెందిన దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన భూములను  సాదిక్ ఖాన్ దౌర్జన్యంగా తన పేరు మీద రాయించుకున్నాడని తెలిపారు.   40 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కోల్పోవడం, మరోవైపు నిరంతరం సాగిన మానసిక వేధింపులు తాళలేకే నూకరాజు తన కుటుంబంతో బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిందన్నారు.  ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ మత మార్పిడి నెట్‌వర్క్ ఒక సామ్రాజ్యంగా విస్తరించిందనీ.. బాధితుల వెతలు వర్ణనాతీతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకప్పుడు వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితంగా, పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు నేరుగా జగన్ పాలనలోనే  బలవంతపు మతమార్పిడులు జరిగాయనీ, లవ్ జిహాద్ పేరిట భూదందాలు సాగాయంటే విమర్శల దాడి చేయడం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతోంది.  బాధితులకు న్యాయం జరగాలని, ఈ మత మార్పిడి కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారులపై  విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  

Love Jihad in Ap, Jagan Tenure, Vijayasai Reddy comments, Jagan conversion allegations, AE Nookaraju suicide case,Andhra Pradesh politics, Vijayasai Reddy press meet

By
en-us Political News

  
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.  
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.  రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు   అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా  చర్యలు తీసుకున్నారు. 
పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన  బుధవారం తెల్లవారు జామున దాదాపు ఒంటింట ప్రాంతంలో  తుఫాన్  ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది.
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3 వేల186 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగిన సంగతి విదితమే.  ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2 వేల 382 వార్డులు ఉన్నాయి.
నిజాంపట్నం, వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కృష్ణపట్నంలో 8వ నంబర్, విశాఖ ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతిలో  తనను కలిసిన కేంద్ర బృందంతో సమావేశంలో  తుఫాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించిన చంద్రబాబు, త్వరితగతిన కేంద్రం నుంచి తగిన ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరారు.
టీటీడీ పాలకమండలి స్థానంలో కొత్త పాలక మండలి ఏర్పాటు అయ్యేంత వరకూ   టీటీడీ సమగ్ర నిర్వహణ బాధ్యతలను  ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక  కమిటీ (స్పెసిఫైడ్ అథారిటీ) ని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.  
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన మురసు తుపాను వేగంగా కదులుతూ తీరం వైపు దూసుకొస్తోందన్నవాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో  తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులకు, పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.  
స్వర్గస్థులైన బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పూలమాలలు వేసి అశ్రునయనాలతో ఘన నివాళు లర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు.  పాఠశాల ప్రాంగణంలో ఓ దుండగుడు జరిపిన పాశవిక దాడిలో  తీవ్రంగా గాయపడిన  బాలిక చికిత్సకు స్పందిస్తున్నదనీ, ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని వైద్యులను ఉటంకిస్తూ నారా లోకేష్ తెలిపారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.