టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ కు ఆద్యుడు: బాలసుబ్రహ్మణ్యం పార్ధివ దేహానికి చంద్రబాబు నివాళులు.!

Publish Date:Nov 2, 2026

Advertisement

విశ్రాంత ఐపీఎస్ అధికారి  బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్గస్థులైన బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పూలమాలలు వేసి అశ్రునయనాలతో ఘన నివాళు లర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పోలీసు విభాగానికి వన్నె తెచ్చిన ఒక దక్షత కలిగిన అధికారిని కోల్పోవడం సమాజానికి, రాష్ట్రానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.

ఉద్యోగ విరమణ పొందిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఆయన చికిత్స పొందుతూ కన్నుమూయడం అత్యంత విచారకరమన్న చంద్రబాబు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ బాలసుబ్రహ్మణ్యం ధైర్యంతో పెద్ద యుద్ధమే చేశారన్నారు. ప్రాణాంతక వ్యాధికి చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఆయన ధైర్యాన్ని సడలనివ్వకుండా తమ అధికార బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా, నిబద్ధతతో నిర్వహించారని కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో నెలకొన్న పరిస్థితులు, ఎదురైన సవాళ్లను చూసి ఆయన ఎంతగానో బాధపడ్డారని గుర్తు చేసుకున్న చంద్రబాబు,    మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు నవ్యాంధ్రలో పోలీసు శాఖలో వివిధ హోదాల్లో బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతమైన జగిత్యాలలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టి శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారనీ,  ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఆ సంస్థను సమర్థవంతమైన బాటలో నడిపించడంలో తన మార్కు పరిపాలనను చూపించారని చంద్రబాబు కొనియాడారు. 

పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై బాలసుబ్రహ్మణ్యానికి ప్రత్యేక శ్రద్ధ ఉండేదని, ఈ క్రమంలోనే విభాగానికి విప్లవాత్మక మార్పులను పరిచయం చేశారని చెప్పరు. ప్రగతిశీల వ్యవస్థలను అమల్లోకి తెచ్చి, సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌కు బాలసుబ్రహ్మణ్యం ఆద్యుడిగా నిలిచారని ప్రశంసించారు. తను పనిచేసిన ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేస్తూ అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎల్లప్పుడూ ప్రజాహితం కోసమే శ్రమించిన నిష్పాక్షిక అధికారిగా నిలిచారన్నారు.

  శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా సంస్కరణల అమలులోనూ బాలసుబ్రహ్మణ్యం చూపిన మార్గదర్శకత్వం ఎందరో యువ అధికారులకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.  దివంగత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.  


[AP CM Chandrababu Tribute Balasubrahmanyam, Ex IPS Balasubrahmanyam, Andhra Pradesh, Telugu One] 

By
en-us Political News

  
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు.  పాఠశాల ప్రాంగణంలో ఓ దుండగుడు జరిపిన పాశవిక దాడిలో  తీవ్రంగా గాయపడిన  బాలిక చికిత్సకు స్పందిస్తున్నదనీ, ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని వైద్యులను ఉటంకిస్తూ నారా లోకేష్ తెలిపారు.  
పరారీలో ఉన్న నిందితుడిని గాలిస్తుండగా పోలీసులకు సదరు నిందితుడు ఎదురుపడ్డాడు. పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ నిందితుడు పట్టించుకోలేదు సరికదా పోలీసులపై ఎదురు తిరిగాడు. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆత్మసంరక్షణార్థంపోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.  
తుపాను తీరం దాటే సమయంలో . తీరం దాటే సమయంలో గంటకు   110 కిలోమీటర్లకు పైబడిన వేగంతో  వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.  ఈ తుపాను ప్రభావం  దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాపై తీవ్రంగా ఉ:టుంది. తుపాను కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో అమానుష దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ వైద్యులను కోరారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండం
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Nandamuri Balakrishna, Balakrishna Voting, Hindupur MLA, AP Municipal Elections, Andhra Pradesh Politics, Balakrishna Political Comments, Public Welfare, Local Body Elections, Voting Rights, TDP, Hindupur Elections, AP Election News
నిత్యం ప్రజల మధ్య ఉండే చంద్రబాబు నాయుడు 53 రోజులు నిర్బంధంలో ఉండటాన్ని తెలుగువారు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ఎలా ఉన్నారు? అనే ఆతృతతో, ఆందోళనతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.