విజయవాడ మెట్రోపై నాని వ్యాఖ్యలు.. సర్వత్రా విమర్శలు.!

Publish Date:Aug 24, 2026

Advertisement

విజయవాడ ఎంపీగా రెండు సార్ల పని చేసిన కేశినేని నాని.. ఇప్పుడు అదే విజయవాడ అభివృద్ధిని అడ్డుకుంటానంటున్నారు. ప్రతిష్ఠాత్మకమైన మెట్రో ప్రాజెక్టు వద్దంటున్నారు కేశినేని నాని. మెట్రో ప్రాజెక్టు విషయంలో మాజీ ఎంపీ కేశినేని నాని లేవనెత్తుతున్న అభ్యంతరాలు, విమర్శలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రతిపాదిత మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడ నగరానికి   వరమా కాదు శాపం అంటూ ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటూ సంధించిన ప్రశ్నలపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ కేశినేని నాని అంటున్నదేమిటయ్యా అంటే.. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం వ్యయం చేసే వేల కోట్ల నిధులను నగరంలో రోడ్లు, డ్రైనేజీ, తాగు నీరు వంటి మౌలిక వసతులపై వెచ్చించాలని. అయితే ఇక్కడ ఎంపీగా పని చేసిన కేశినేని నాని మిస్ అయిన లాజిక్ ఏమిటంటే..  రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు లాంటి మౌలిక వసతులపై మున్సిపల్ కార్పొరేషన్లు , రాష్ట్ర ప్రభుత్వాలు  బడ్జెట్ కేటాయింపులు చేస్తూనే ఉంటాయి. అవి ఆగవు.. కానీ మెట్రో రైల్ ప్రాజెక్టు వంటి  అర్బన్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ కోసం   అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు   సాఫ్ట్ లోన్స్ మంజూరు చేస్తాయి.   కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ నిధులు ఇస్తుంది. అటువంటి నిధులను   రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్య వంటి వాటి కోసం వ్యయం చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు.  

నిజమైన విజనరీ ఎవరైనా సరే..  ప్రాథమిక సదుపాయాలు కల్పించడంతో పాటు మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులను సాధించేదుకు కృష్టి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే చేశారు.  ఆ విషయాన్ని విస్మరించి మెట్రో వద్దు, ఆ నిధులను మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయాలంటూ  కేశినేని నాని జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నించడం ఆయనను నవ్వుల పాలు చేస్తున్నది. 

బెజవాడలో  జనాభా ,  ట్రాఫిక్ విపరీతంగా పెరిగాయి. ట్రాఫిక్ కారణంగా ఐటీ కారిడార్లు, గన్నవరం ఎయిర్‌పోర్ట్, మంగళగిరి గుంటూరు కనెక్టివిటీ   పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో మెట్రో రైల్ అన్నిటికీ పరిష్కారంగా మారుతుందనడంలో సందేహం లేదు.  భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో లాంటి ప్రజా రవాణా వ్యవస్థ  లేకపోతే బెజవాడ ట్రాఫిక్ స్తంభించిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అవేమీపట్టించుకోకుండా కేశినేని ట్రావెల్స్ పేరిట సుదీర్ఘ కాలం ట్రావెల్ ఏజెన్సీ నడిపి, రవాణా రంగంలో   అనుభవం ఉందని తనకుతాను భుజాలు చరుచుకుంటున్న కేశినేని నాని మెట్రో రైల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  

2024 ఎన్నికలలో కేశినేని నాని వైసీపీ అభ్యర్థిగా విజయవాడ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అప్పటి నుంచీ రాజకీయంగా దాదాపు సైలెంట్ అయిపోయిన ఆయన ఇప్పుడిప్పుడే రాజకీయంగా తన పునరాగమనం కోసం అడుగులు వేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆయన బెజవాడ మెట్రోకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ రాజధానికి ప్రత్యామ్నాయంగా మావిగన్ ప్రతిపాదన ఎలా ఆయన ప్రతిష్ఠను దిగజార్చి నెటిజన్ల ట్రోలింగ్ కు గురి చేసిందో, ఇప్పుడు కేశినేని మెట్రో వద్దు అంటూ చేస్తున్న వ్యాఖ్యలు, మెట్రోకు వ్యతిరేకంగా సంధిస్తున్న ప్రశ్నలు, విమర్శలు కూడా నానిని నెటిజనుల ట్రోలింగ్ కు గురి చేస్తున్నాయి. ప్రజలలో ఉన్న కాస్తో కూస్తో ప్రతిష్ఠను కూడా దిగజారుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

Kesineni Nani Oppose Vijayawada Metro Rail Project, Kesineni Nani Metro Comments, Vijayawada Infrastructure Development, Netizens Troll, APpolitics, TeluguOne

By
en-us Political News

  
పోలీసు శాఖ ఇంత నిర్భయంగా, స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా పని చేయడం వెనుక ఉన్నది కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. దీంతో ఇప్పుడాయన పేరు రాజకీయవర్గాలలోనే కాకుండా జనబాహుల్యంలో కూడా మార్మోగిపోతోంది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేసే అధికారిగా ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.  
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.  రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు   అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా  చర్యలు తీసుకున్నారు. 
పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన  బుధవారం తెల్లవారు జామున దాదాపు ఒంటింట ప్రాంతంలో  తుఫాన్  ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఆరున్నర గంటలకల్లా పూర్తిగా తీరాన్ని దాటింది.
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3 వేల186 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగిన సంగతి విదితమే.  ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2 వేల 382 వార్డులు ఉన్నాయి.
నిజాంపట్నం, వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కృష్ణపట్నంలో 8వ నంబర్, విశాఖ ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతిలో  తనను కలిసిన కేంద్ర బృందంతో సమావేశంలో  తుఫాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించిన చంద్రబాబు, త్వరితగతిన కేంద్రం నుంచి తగిన ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరారు.
టీటీడీ పాలకమండలి స్థానంలో కొత్త పాలక మండలి ఏర్పాటు అయ్యేంత వరకూ   టీటీడీ సమగ్ర నిర్వహణ బాధ్యతలను  ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక  కమిటీ (స్పెసిఫైడ్ అథారిటీ) ని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.  
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన మురసు తుపాను వేగంగా కదులుతూ తీరం వైపు దూసుకొస్తోందన్నవాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో  తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులకు, పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.  
స్వర్గస్థులైన బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పూలమాలలు వేసి అశ్రునయనాలతో ఘన నివాళు లర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.